AP: సచివాలయ సిబ్బందికి మరో బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే.. బాబు వాడకం మామూలుగా లేదు?

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకురావడమే కాకుండా కొత్తగా 1,20,000 కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగస్తులను నియమింప చేశారు. ఈ క్రమంలోనే ఆ గ్రామ పరిధిలో ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న సచివాలయంలోనే ఆ సమస్యకు పరిష్కారమయ్యే విధంగా ఒకసారి కొత్త వ్యవస్థను గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారు.

ఇకపోతే వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. వాలంటీర్లను ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించి ఆ 50 ఏళ్ల అవసరాలను వాలంటీర్ల ద్వారా సచివాలయంలో పరిష్కారం తెలియజేసేవారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాలంటీర్ సేవలను కూడా సచివాలయం సిబ్బందితోనే నిర్వహిస్తూ ఉన్నారు.

ఇటీవల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు లేకపోయినా సచివాలయ ఉద్యోగస్తులు ద్వారానే పింఛన్లను పంపిణీ చేశారు. ఇకపోతే సచివాలయ ఉద్యోగస్తులకు చంద్రబాబు నాయుడు మరో కీలక బాధ్యత అప్పగించబోతున్నారని తెలుస్తుంది. గ్రామాల్లో చదువుకున్న యువత ఎంత మంది ఉన్నారు. వారు ఏఏ రంగాల్లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాలతోపాటు పలు విషయాలపై ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగస్తులకు అప్పగించబోతున్నారని తెలుస్తుంది.

స్కిల్ సెన్సెస్…
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన సంతకాలలో స్కిల్ సెన్సెస్ ఫైలు కూడా ఒకటి దీని ద్వారా వివిధ కోర్సులలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందజేసి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ బాధ్యతలను కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించడం గమనార్హం.