Brahmaji at SlumDog Husband Movie Interview
Bramhaji: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా చూసిన సెలెబ్రెటీలు అందరూ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సపోర్టింగ్ పాత్రలలో, కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.నటుడు బ్రహ్మజీ. అయితే ఈయన కూడా ఇటీవల కల్కి సినిమా చూశారని తెలుస్తుంది..ఈ సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా అనుకుంటే వరల్డ్ సినిమా తీశారు.. నాగ్ అశ్విన్ గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను. థాంక్యూ ప్రియాంక దత్, స్వప్న దత్. మీ రిస్కులే మీకు శ్రీరామరక్ష అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే నాగ్ అశ్విని సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని ఈ సినిమా విడుదలైన రోజు ఈయన తన చెప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మీ రిస్కులే.. మీకు శ్రీరామరక్ష…
ఈ సినిమా కోసం తాను కాళ్లకు చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూ కష్టపడ్డానని ఈయన వెల్లడించారు. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బ్రహ్మాజీ ఆ చెప్పులను తనికిస్తే ముద్దు పెట్టుకుంటానంటూ చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…