AP Politics: ఎన్నికలు ఎప్పుడు జరిగిన 160 స్థానాలు తెదేపావే: అచ్చం నాయుడు

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎంత రసవత్తరంగా మారుతూ ఉంటాయి. నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాజాగా విశాఖలో బుధవారం నిర్వహించిన జోన్‌-1 (ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధి) సమీక్షసమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత అచ్చం నాయుడు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అచ్చం నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఎంతోమంది ముఖ్యమంత్రిలు పరిపాలించారు. అయితే మొదటిసారి ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని తెలియజేశారు.ఇలాంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం.

సొంత పార్టీ నాయకులే ఆయనని నమ్మడం లేదు అలాంటిది ఈయన నువ్వే మా నమ్మకం జగన్ అని ప్రజల ముందుకు వెళుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.జగన్ అంటే నమ్మకం కాదు ఆయన రాష్ట్రానికి పట్టిన ఓ దరిద్రం అంటూ అచ్చం నాయుడు ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు చేశారు.ఇక ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియచేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలను కోరారు.

AP Politics: ఎమ్మెల్సీ ఫలితాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి…

ఇక జగన్ పని అయిపోయిందని వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడం ఖాయం అని తెలిపారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఏకంగా 160 సీట్లను గెలుపొంది అధికారాన్ని అందుకుంటుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇక 30 సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని గొప్పలు చెప్పిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలను బ్రతిమాలుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయని అచ్చం నాయుడు వెల్లడించారు.