Game Changer: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా మీద అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. దీంతో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా మీడియా ముందుకి వచ్చిన దిల్ రాజు గేమ్ చేంజర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ..” మొదట ఇండియన్ 2 సినిమాని నిర్మించాలని అనుకున్నాను. కానీ అది కుదరకపోవడంతో శంకర్ గారు గేమ్ చేంజర్ స్టోరీ ని వినిపించాడు. కథ నచ్చతంతో సినిమా చేయటానికి ఓకే చెప్పాను. ఈ సినిమా ఒక ఎన్నికల అధికారి చుట్టూ తిరుగుతుంది. అందువల్ల ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో తీయాలని శంకర్ గారు అనుకున్నారని దిల్ రాజు తెలిపాడు .
ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కాకుండా రామ్ చరణ్ అయితే సరిగ్గా సరిపోతాడని చెప్పటంతో శంకర్ గారు ఆలోచించి ఈ స్టోరీ ని చరణ్ వినిపించాడు. ఇక ఈ స్టోరీ చరణ్ కి నచ్చటంతో సినిమా చేయటానికి ఒకే చెప్పాడు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా సినిమా కోసం శంకర్ అధిక మొత్తంలో ఖర్చు చేయిస్తాడని అందువల్లే దిల్ రాజు శంకర్ కి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న వార్తల గురించి దిల్ రాజు స్పందించాడు. ఆ వార్తలలో నిజం లేదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…