Tag Archives: dil raju

Balagam: అందరూ బలగం సినిమా చూశారు నువ్వు మాత్రం చూడలేదు.. ఎమోషనల్ అయినా వేణు!

Balagam: బలగం సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జబర్దస్త్ కమెడియన్ వేణు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు అనంతరం సినిమాలపై ఉన్నటువంటి ఇష్టంతో జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి సినిమాల ప్రయత్నాలు చేశారు.

ఇలా వేణుకు దిల్ రాజు అవకాశం ఇవ్వడంతో తన కుమార్తె నిర్మాణంలో వేణు బలగం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలంగాణలో మారుమూల గ్రామంలో కూడా ప్రత్యేకంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ సినిమాని చూశారు అంతేకాకుండా చిన్నచిన్న మనస్పర్ధలు కారణంగా విడిపోయినటువంటి తోబుట్టువులు కూడా ఈ సినిమా చూసి కలిసారు అంటే ఈ సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తండ్రిని గుర్తు చేసుకున్న వేణు..

ఈ సినిమాకు ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇలా థియేటర్లలో ఒక చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా వేణు మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బలగం సినిమాని అందరూ చూశారు కానీ నువ్వు మాత్రం చూడలేదు నాన్న అంటూ తన తండ్రి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. వేణు తండ్రి గత పాతిక సంవత్సరాల క్రితమే మరణించారు. అయితే తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకొని ఈయన తన తండ్రి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

Dil Raju: ఎన్నికలవేళ కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు.. రాజకీయంగా మొదలైన చర్చలు?

Dil Raju: తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఆయా పార్టీలు ఎంతో బిజీగా గడుపుతున్నాయి.

ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నఫలంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. దీంతో ఈ విషయం కాస్త రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు కారణమైంది. కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు రాజకీయాలలోకి ఏమైనా రాబోతున్నారా అని అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు కేసీఆర్ ని కలవడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీ తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. క్రమంలోనే దిల్ రాజు ఈ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. ఇలా పెళ్లి వేడుకలలో బిజీగా ఉన్నటువంటి ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కలిసి స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.

వివాహ ఆహ్వానం..

ఈ క్రమంలోనే కేసీఆర్ ని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆశిష్ హీరోగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Ashish Reddy: ఉదయపూర్ లో ఆశిష్ రెడ్డి వివాహం.. తరలిరానున్న టాలీవుడ్ తారలు?

Ashish Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది ఎంతోమంది సెలెబ్రెటీలు వివాహం చేసుకోగా మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకున్నారు. ఇలా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి వారందరూ కూడా ఈ ఏడాదిలో పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.

ఇక దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడిగా ఆశిష్ రెడ్డి అందరికీ పరిచయమయ్యారు. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నటువంటి ఆశిష్ త్వరలోనే సెల్ఫిష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇక ఈయన గత ఏడాది నవంబర్ నెలలో విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్విత రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు తాజాగా వీరి పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఉదయపూర్ లో వివాహం..

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహం జైపూర్ లోని ఓ పురాతన ప్యాలెస్ లో జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ సెలబ్రెటీల అందరిని కూడా ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా వివాహానికి టాలీవుడ్ తారలందరూ కూడా కదలి రానున్నారని సమాచారం.

Allu Arjun: నేను అందంగా లేనని రిజెక్ట్ చేశారు… నటుడిగా నేను ఫెయిల్ అయ్యాను: అల్లు అర్జున్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ నేడు నేషనల్ అవార్డు అందుకోవడంతో మెగా అభిమానులతో పాటు అల్లు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నప్పటికీ ఈ అవార్డు వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని అంతేకాకుండా ఓ భారీ నిర్మాణ సంస్థ తనని రిజెక్ట్ చేశారు అంటూ ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ గంగోత్రి కంటే ముందుగానే తనకు ఓ పెద్ద బ్యానర్ లో అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇలా ఆ పెద్ద బ్యానర్ తనకు సినిమా అవకాశం కల్పించి అనంతరం తాను అందంగా లేనని తనని ఆ సినిమా నుంచి రిజెక్ట్ చేశారని అల్లు అర్జున్ తెలిపారు. ఇలా అందంగా లేనని నన్ను రిజెక్ట్ చేయడంతో ఆ సమయంలో చిరంజీవి గారు నాన్న చాలా బాధపడ్డారని అయితే సొంతంగా వాళ్లే తనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అదే సమయంలోనే గంగోత్రి సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు.

Allu Arjun: ఆర్య సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు…


ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తన పట్ల చాలా విమర్శలు వచ్చాయి. నటుడిగా అప్పుడు కూడా తాను ఫెయిల్ అయ్యానని తెలిపారు కానీ తనకు మాత్రం నటన వచ్చు అన్న నమ్మకం తనకు ఉండేదని అల్లు అర్జున్ వెల్లడించారు. అదే సమయంలోనే దిల్ రాజు కొత్తవారితో సినిమా చేస్తున్నారని తెలియడంతో ఆర్య సినిమాకు తాను ఎంపిక అయ్యానని అప్పటినుంచి తాను ఇండస్ట్రీలో కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Dil Raju: కొడుకుతోపాటు చిన్న పిల్లాడిగా మారిపోయిన దిల్ రాజు… వైరల్ అవుతున్న బర్త్ డే వీడియో!

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దిల్ రాజు ఇప్పటివరకు తన నిర్మాణ సంస్థలో 50 సినిమాలను నిర్మించారు.ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ దంపతులకు కుమార్తె హన్షిత రెడ్డి ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. తనకు ఇద్దరు సంతానం కూడా కలరు.అయితే తన భార్య అనిత మరణించడంతో తన కుమార్తె స్వయంగా తన తండ్రికి రెండో వివాహం చేశారు. వైగా రెడ్డి అనే అమ్మాయితో దిల్ రాజుకు రెండో వివాహం జరిపించారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు. తన కుమారుడికి ఇద్దరు భార్యల పేర్లు కలిసి వచ్చేలా అన్వయ్ రెడ్డి అనే నామకరణం చేశారు.

ఇక ఈ బాబుకి ఏడాది పూర్తి కావడంతో దిల్ రాజు తన కొడుకు పుట్టినరోజు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ పుట్టిన రోజు వేడుకల కోసం సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి ఘనంగా పార్టీ ఇచ్చారు.అయితే బర్తడే కన్నా ముందుగా దిల్ రాజు తన కుమారుడి కోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయించారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు.


Dil Raju: ఘనంగా అన్వయ్ పుట్టినరోజు వేడుకలు…

ఈ వీడియోలో దిల్ రాజు కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా సంతోషంగా ఆటపాటలతో తమ కొడుకుతో కలిసి ఆడుకున్నారు. ఇక తన కొడుకు కోసం దిల్ రాజు ఏకంగా చిన్నపిల్లాడిలా మారిపోయి తనని ఆడిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సాంగ్ కి థమన్ సంగీతం అందించగా కార్తీక్ పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shaakuntalam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న శాకుంతలం … స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడంటే..?

Shaakuntalam: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం,విజువల్స్ నాసిరకంగా ఉండడంతో ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది . ఇక ఈ సినిమా సమంతకెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా గురించి సమంత స్పందిస్తూ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అంటూ భగవద్గీతలోని ఒక కొటేషన్ షేర్ చేసింది. దిల్ రాజు కూడా ఈ సినిమా మీద భారీ నమ్మకంతో నిర్మాతగా వ్యవహరించాడు. అయితే దిల్ రాజు పాతికేళ్ళ సినీ కెరీర్ లో కూడా శాకుంతలం భారీ దెబ్బ తీసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించాడు.

ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. అందువల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ అప్డేట్ కూడా తెరమీదకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

aa

Shaakuntalam: అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్…

ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల ఓటీటీ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ దరకే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా భారీ డిజాస్టర్ కావడంతో పాటు థియేటర్ల నుంచి సినిమాని తప్పించడంతో మే 12 వ తేదీ నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు సమాచారం. అయితే శాకుంతలం ఓటిటి రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడ లేదు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Shaakuntalam: తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమా పెద్ద జర్క్… దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Shaakuntalam: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా హిట్టు అవటంతో సినిమా పేరు తన పేరుగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాతగా రాణిస్తున్న దిల్ రాజు ఎన్నో జయాపజయాలు చూసాడు.

దిల్ రాజు నిర్మించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించి దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలి దిల్ రాజు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా విషయంలో కూడా దిల్ రాజుకి నిరాశ మిగిలింది. సమంత కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం సినిమా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై అందరినీ నిరాశ పరిచింది.

ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు శాకుంతలం సినిమా డిజాస్టర్ గురించి స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ఇంటర్వ్యు లో శాకుంతలం డిజాస్టర్ గురించి స్పందించిన దిల్ రాజు.. ‘తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చినట్లు తెలిపారు.

Shaakuntalam: భారీ నష్టాలను ఎదుర్కొన్న దిల్ రాజు…

ఈ సినిమా వల్ల తాను పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు దిల్ రాజు తెలిపాడు.మొత్తానికి శాకుంతలం సినిమా అటు సమంత ఇటు దిల్ రాజు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ తన కుమార్తె నీలిమతో కలసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు.అయితే దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేశాడు. దీనితో దిల్ రాజుకు కూడా శాకుంతలం వల్ల భారీ నష్టం మిగిలింది.

Dil Raju: రాములోరి కళ్యాణంలో ఆటపాటలతో సందడి చేసిన దిల్ రాజు దంపతులు… వీడియో వైరల్!

Dil Raju: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారిపోయారు.సాధారణంగా ఇండస్ట్రీలో నిర్మాతలుగా కొనసాగడం అంటే ఎంతో కష్టతరమైన పని అలాంటిది 50 సినిమాలకు పైగా నిర్మాణాలు చేపట్టారు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇలా సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉండే దిల్ రాజు తనకు ఖాళీ సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతుంటారు.మొదటి భార్య అనిత మరణించడంతో కరోనా సమయంలో వైగా రెడ్డి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.ఇక వీలు కుదిరినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి పలు దైవ దర్శనాలకు వెళుతూ ఉంటారు.

శ్రీరామనవమి పండుగ సందర్భంగా దిల్ రాజు దంపతులు సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియోలో భాగంగా దిల్ రాజు తన భార్య వైగా రెడ్డితో పాటు కుమారుడితో కలిసి రాములోరి కళ్యాణంలో పాల్గొన్నారు. ఇలా పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.


Dil Raju: భక్తిశ్రద్ధలతో పూజలు…

ఇక పూజ అనంతరం ఆటపాటలతో పెద్ద ఎత్తున దిల్ రాజు తన భార్య వైగా రెడ్డితో కలిసి సందడి చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోలో బలగం డైరెక్టర్ వేణు జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా సందడి చేశారు.ఇలా సీత రాముల కల్యాణ మహోత్సవంలో భార్యతో కలిసి దిల్ రాజు పెద్ద ఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Balagam Movie: బలగం సినిమా కోసం నా ఇంటిని ఇస్తే వేణు ఒక థాంక్స్ కూడా చెప్పలేదు… సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంటి ఓనర్!

Balagam Movie: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం.సినిమాలు దమ్ముంటే చిన్న సినిమా ఆయన పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.ఇలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతాలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా ఎక్కువ భాగం సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ఉన్న ఇల్లు కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఉంది. అయితే తాజాగా ఈ ఇంటి ఓనర్ డైరెక్టర్ వేణు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డైరెక్టర్ వేణు ది మా ఊరే కావడంతో ఒకరోజు తన వద్దకు వచ్చి దిల్ రాజు సినిమా అవకాశం ఇచ్చారు మీ ఇల్లు నాకు కావాలి అని అడిగారు.ఇలా సినిమా కోసం ఇల్లు కావాలి అని అడగడంతో నెలన్నర రోజులపాటు నేను వేరే ఇంట్లో ఉండి తన ఇంటిని సినిమా షూటింగ్ కోసం ఇచ్చాను.సినిమా షూటింగ్ జరిగే ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే షూటింగ్ సమయంలో ఇంటిని తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పారు.

Balagam Movie: డబ్బులు కూడా ఇస్తామన్నారు…

ఇప్పటివరకు తనకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్ వేణు కనీసం ఒక ఫోన్ చేసి తనకు థాంక్స్ కూడా చెప్పలేదని ఇంటి ఓనర్ రవీందర్రావు తెలిపారు.మేము డైరెక్టర్ వేణు నుంచి ఇలాంటివి ఏమీ ఆశించలేదు కానీ ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Game Changer: గేమ్ చేంజర్ కోసం ఫస్ట్ ఆప్షన్ రామ్ చరణ్ కాదా… మరి ఎవరంటే?

Game Changer: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా మీద అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. దీంతో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా మీడియా ముందుకి వచ్చిన దిల్ రాజు గేమ్ చేంజర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ..” మొదట ఇండియన్ 2 సినిమాని నిర్మించాలని అనుకున్నాను. కానీ అది కుదరకపోవడంతో శంకర్ గారు గేమ్ చేంజర్ స్టోరీ ని వినిపించాడు. కథ నచ్చతంతో సినిమా చేయటానికి ఓకే చెప్పాను. ఈ సినిమా ఒక ఎన్నికల అధికారి చుట్టూ తిరుగుతుంది. అందువల్ల ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో తీయాలని శంకర్ గారు అనుకున్నారని దిల్ రాజు తెలిపాడు .

Game Changer:పవన్ కళ్యాణ్ ను వద్దన దిల్ రాజు…

ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కాకుండా రామ్ చరణ్ అయితే సరిగ్గా సరిపోతాడని చెప్పటంతో శంకర్ గారు ఆలోచించి ఈ స్టోరీ ని చరణ్ వినిపించాడు. ఇక ఈ స్టోరీ చరణ్ కి నచ్చటంతో సినిమా చేయటానికి ఒకే చెప్పాడు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా సినిమా కోసం శంకర్ అధిక మొత్తంలో ఖర్చు చేయిస్తాడని అందువల్లే దిల్ రాజు శంకర్ కి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న వార్తల గురించి దిల్ రాజు స్పందించాడు. ఆ వార్తలలో నిజం లేదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.