Connect with us

Featured

Dil Raju: ఎన్నికలవేళ కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు.. రాజకీయంగా మొదలైన చర్చలు?

Published

on

Dil Raju: తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఆయా పార్టీలు ఎంతో బిజీగా గడుపుతున్నాయి.

Advertisement

ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నఫలంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. దీంతో ఈ విషయం కాస్త రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు కారణమైంది. కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు రాజకీయాలలోకి ఏమైనా రాబోతున్నారా అని అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు కేసీఆర్ ని కలవడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీ తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. క్రమంలోనే దిల్ రాజు ఈ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. ఇలా పెళ్లి వేడుకలలో బిజీగా ఉన్నటువంటి ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కలిసి స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.

వివాహ ఆహ్వానం..

Advertisement

ఈ క్రమంలోనే కేసీఆర్ ని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆశిష్ హీరోగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

Featured

Chandra Babu Naidu: పొత్తు ఆలోచన ఎవరిది… జైలు గోడల మధ్య జరిగింది ఇదేనా?

Published

on

Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలను ఈయన వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ తో పొత్తు గురించి కూడా బాబు కీలక విషయాలు వెల్లడించారు.

Advertisement

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు సుమారు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత బయటకు వచ్చి టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తర్వాత అంతా తెలిసిందే. ఆరోజు జైలులో జరిగిన ఈ మీటింగ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.

ఈ పొత్తు ఆలోచన ఎవరిది అనే విషయంపై తాజాగా బాలయ్య ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.జైలులో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌, లోకేష్ వచ్చి నన్ను కలిశారు. పవన్‌ కల్యాణ్ తో నేను 2 నిమిషాలు మాట్లాడాను. ‘ధైర్యంగా ఉన్నారా సార్’ అని పవన్ అడిగారు. ‘ నా జీవితంలో నేనెప్పుడూ అధైర్య పడలేదు. భయపడను. మీరు కూడా ధైర్యంగా ఉండండి’ అని పవన్ తో చెప్పాను.

అదే విజయానికి నాంది..
రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానని పవన్ చెప్పారు. ఆ సమయంలో నేనే పొత్తు గురించి ఓసారి ఆలోచించండి కలిసి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పాను ఆ విషయంపై ఆలోచించిన పవన్ నేను బీజేపీకి కూడా నచ్చజెప్పి ఈ కూటమిలోకి తీసుకువస్తానని చెప్పాడు. ఆ తరువాత బయటకు వెళ్లి పవన్ కూటమి ప్రకటన చేశారు. అదే తమ విజయానికి నాంది అంటూ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Chandra Babu Naidu: చనిపోతే ఒక్క క్షణమే… అరెస్టు విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేనిది: చంద్రబాబు

Published

on

Chandra Babu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

Advertisement

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ ఆ రోజు నంద్యాల పర్యటన పూర్తిచేసుకుని తాను బస్సులో రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ బయట అలజడి వాతావరణం సృష్టించారు. నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారు.

ఇలా నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా అడవులలో అమరావతికి తీసుకువచ్చారు. ఇక అమరావతికి వచ్చిన తరువాత రాత్రంతా విచారణ పేరుతో అక్కడ ఇక్కడ తిప్పారు. మరుసటి రోజు ఉదయం మెడికల్ టెస్ట్ ల కోసం పంపించారు అలాగే కోర్టుకు తీసుకెళ్లి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేశారు.

ఆశయం కోసం..
ఇక ఆరోజు అర్ధరాత్రి నన్ను రాజమండ్రి జైలుకు పంపించారు. ఇక జైలులో కొన్ని సందేహ సంఘటనలు జరిగాయని కానీ నేను భయపడకుండా వాటిని ఎదుర్కొన్నాను కాబట్టి నేడు ఇక్కడ ఉన్నాను లేకపోతే ఏమై ఉండేదో చెప్పలేమంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము అని అన్నారు. దీంతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai Dharam Tej: పవన్ మామయ్య లేకపోతే నేనులేను.. అలా ప్రాణాలతో బయటపడ్డా: సాయి ధరమ్ తేజ్

Published

on

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల సోషల్ మీడియాలో అలాగే కెరియర్ పరంగా కూడా చాలా బిజీగా, యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా సాయి తేజ్ హైదరాబాద్‌లో జాతీయ దినపత్రిక, వెబ్ సైట్ ఏబీపీ నిర్వహిస్తున్న ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయి తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయనే నాకు గురువు. సినిమాలలో నటించాలని ఆసక్తి ఉందని తెలియగానే నటనలో,ఫైట్స్, కిక్ బాక్సింగ్‌ ట్రైనింగ్ ఇచ్చాడు.నా జీవితానికి కావాల్సిన కీలక విషయాలకు స్పూర్తి అందించారు. ఆయన నా గైడ్. నన్ను అలా నడిపిస్తుంటాడు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

బ్రో సినిమాలో ఆయనతో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అదే నేను తనకిచ్చిన గురుదక్షిణ అంటూ సాయి తేజ్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ జాగ్రత్తలను కూడా తెలియజేశారు. ఈయన బైక్ పై ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.

హెల్మెట్ తప్పనిసరి..
అప్పటినుంచి ఈయన ఏ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి జాగ్రత్తలను తెలియజేస్తూ ఉంటారు. బైక్ మీద ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఆ హెల్మెట్ నన్ను ప్రాణాలతో నిలబెట్టింది అంటూ సాయిధరమ్ తేజ్ మరోసారి తనకు జరిగిన యాక్సిడెంట్ సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!