General News

Devineni Uma: స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయింది… జగన్ కి అదే దిక్కు!

Devineni Uma: ఆంధ్రప్రదేశ్లో జగన్ రాక్షస పాలనకు ప్రజలు విసిగిపోయారని వచ్చే ఎన్నికలలో ఓటుతో జగన్ కి బుద్ధి చెప్పబోతున్నారని తెలుగుదేశం నేతలు అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

గతంలో నారా చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు రాష్ట్రం ఇప్పుడు గంజాయి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయిందని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రాన్ని ప్రస్తుత పట్టించారని ఉమా వెల్లడించారు. ఇక జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత వర్గానికి చెందినవారు పూర్తిగా అణచివేయబడ్డారని ఉమా ఈ సందర్భంగా తెలియజేశారు.

వైసిపి దుర్మార్గపు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకే ప్రజా చైతన్య యాత్రలు, గౌరవ సభలను చంద్రబాబు నాయుడు రూపొందించారని అన్నారు.ఇక జగన్ మొద్దు నిద్ర మేల్కొల్పడానికి చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని తెలిపారు. ఆంధ్ర ప్రజలు యువత ఆయనని గద్దెదించి తిరిగి అధికారాన్ని చంద్రబాబు చేతిలో పెట్టాలని ఎదురుచూస్తున్నారని ఉమా తెలిపారు.

Devineni Uma: బంగాళాఖాతంలో కలిపేయాలి…


వైసిపి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు నాయుడు మాటలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా కదిలిస్తున్నాయని ఈయన తెలిపారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసే బహిరంగ సభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఈయన కోరారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago