Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏప్రిల్ 5వ తేదీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా ఈమె పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అభిమానులు తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఈమె థాంక్యూ చెబుతూ ఒక వీడియోని షేర్ చేశారు.
ఈ విధంగా రష్మిక థాంక్యూ చెబుతూ షేర్ చేసిన ఈ వీడియో ద్వారా మరోసారి విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి.ఇదివరకు వీరిద్దరూ కలిసి పలు వెకేషన్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారని వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు రష్మిక ఖండిస్తూ ఉన్నారు.
తాజాగా పుట్టినరోజు సందర్భంగా మరోసారి వీరిద్దరూ దొరికిపోయారు. ఈ క్రమంలోనే రష్మిక షేర్ చేసిన వీడియోలో ఉండే బ్యాక్ గ్రౌండ్ తాజాగా విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలోని బ్యాగ్రౌండ్ ఒకటే కావడంతో వీరిద్దరూ పుట్టినరోజు వేడుకలను ఒకే చోటే సెలబ్రేట్ చేసుకున్నారని వార్తలు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ వీడియోలో రష్మిక తన చూపుడు వేలికి ఉంగరం పెట్టుకోవడంతో అది విజయ్ దేవరకొండ గిఫ్ట్ చేశారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇదే విషయం పైసౌత్ డిజిటల్ మీడియా ఒక పోస్ట్ చేయడంతో వెంటనే రష్మిక స్పందించారు. అయ్యో బాబు నువ్వు అతిగా ఆలోచించకు అంటూ ఈమె కూల్ గా సమాధానం చెప్పారు.అయితే రష్మిక ఎప్పుడు విజయ్ తో డేటింగ్ రూమర్స్ ఖండించిన ఎప్పుడూ కూడా సీరియస్ గా చెప్పలేదు ఇలా లైట్ గా తీసుకోవడంతో ఇద్దరి గురించి వస్తున్నటువంటి ఈ డేటింగ్ రూమర్స్ నిజమేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…