ఈ-పాస్ లేకుంటే తెలంగాణలోకి నో ఎంట్రీ.! సరిహద్దు వద్ద భారీ ట్రాఫిక్ జామ్!!

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపధ్యంలో సరిహద్దులు మరింత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపధ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలోని రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేస్తున్న పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

ఈ నేపధ్యంలో బైలు, ఆటలను సైతం ఈ-పాస్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు. లాక్‌డౌన్‌ సడలింపు ఉంటుందనే భావనతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈపాస్ లేని వారిని వెనక్కి పంపిస్తున్న అధికారులు, మరోసారి ఈపాస్ లేకుండా వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.