AR Rahman: అర్హత లేని సినిమాలను ఆస్కార్ కి పంపుతున్నారు… రెహమాన్ కామెంట్స్ వైరల్!

AR Rahman: చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డులను ప్రకటించినప్పటికీ ఆస్కార్ అవార్డు ఎంతో విలువైనది ప్రతిష్టాత్మమైనదిగా భావిస్తారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆస్కార్ అవార్డు అందుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం.

ఇలా ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన తరుణంలో రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుల గురించి మాట్లాడుతూ…ఆస్కార్ అవార్డుల కోసం అర్హత లేనటువంటి సినిమాలను కూడా పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ సినిమా ఆస్కార్ కి తప్పనిసరిగా వెళ్తుంది అనుకుంటాను కానీ ఆ సినిమా మాత్రం వెళ్లదు. ఆ సమయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఈయన తెలిపారు.

AR Rahman: నామినేషన్స్ లో కూడా నిలవలేదు…

ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లేకపోయినా ఎలాగలాగో ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి అవార్డు అందుకుంది. ఈ క్రమంలోనే రెహమాన్ అర్హత లేని సినిమాలను పంపిస్తున్నారు అనడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ ఎంట్రీ లేకపోయినా గుజరాత్ సినిమా ‘ఛెల్లో షో’ని పంపించారు. అది కనీసం నామినేషన్స్ వరకు కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు రెహమాన్ చేసిన ఈ కామెంట్స్.. ఈ సినిమాను ఉద్దేశించే మాట్లాడారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెహమాన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.