Aravind Swamy: వామ్మో అరవింద స్వామి అన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించారా…. మామూలు సంపాదన కాదుగా?

Aravind Swamy: అరవింద్ స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ పాత్రలలోనూ అలాగే కీలక పాత్రలలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.ఒకానొక సమయంలో స్టార్ హీరోగా తెలుగు తమిళ భాషలలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈయన అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరం కావడంతో చెన్నైలో తమకు ఉన్నటువంటి కంటి ఆసుపత్రితో పాటు ఇతర బిజినెస్ లను చూసుకున్నారు. ఇలా ఈ వ్యాపారాలు చూసుకుంటూనే అరవింద్ స్వామి ‘ట్యాలెంట్ మ్యాక్సిమస్’ అనే ఓ సంస్థని స్థాపించి ఆ సంస్థని ఓ రేంజ్ లో డెవలప్ చేశారు అరవింద్ స్వామి. ఈ సంస్థ ఎవరికి, ఎక్కడ, ఎలాంటి సిబ్బంది కావాలన్నా అరేంజ్ చేస్తుంది.

Aravind Swamy: బిజినెస్ లో బాగా సక్సెస్ అయిన అరవింద్ స్వామి..


ఒక కన్సల్టెన్సీ సంస్థలా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కదాని విలువే దాదాపు 3300 కోట్లు. ఇవి కాకుండా చెన్నైలో ఉన్న హాస్పిటల్,ఇతర బిజినెస్ లు అన్నీ కలిపి మరొక ₹1000 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని తెలుస్తుంది. ఇలా ఈయన హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు బిజినెస్ లు చూసుకుంటూ భారీగా సంపాదించారని,ఈయన మొత్తం ఆస్తులు విలువ కలిపి నాలుగు వేల కోట్లకు పైగా ఉంటాయని తెలుస్తుంది.