Aravind Swamy: అరవింద్ స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ పాత్రలలోనూ అలాగే కీలక పాత్రలలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.ఒకానొక సమయంలో స్టార్ హీరోగా తెలుగు తమిళ భాషలలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈయన అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా ఇండస్ట్రీకి దూరం కావడంతో చెన్నైలో తమకు ఉన్నటువంటి కంటి ఆసుపత్రితో పాటు ఇతర బిజినెస్ లను చూసుకున్నారు. ఇలా ఈ వ్యాపారాలు చూసుకుంటూనే అరవింద్ స్వామి ‘ట్యాలెంట్ మ్యాక్సిమస్’ అనే ఓ సంస్థని స్థాపించి ఆ సంస్థని ఓ రేంజ్ లో డెవలప్ చేశారు అరవింద్ స్వామి. ఈ సంస్థ ఎవరికి, ఎక్కడ, ఎలాంటి సిబ్బంది కావాలన్నా అరేంజ్ చేస్తుంది.
ఒక కన్సల్టెన్సీ సంస్థలా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కదాని విలువే దాదాపు 3300 కోట్లు. ఇవి కాకుండా చెన్నైలో ఉన్న హాస్పిటల్,ఇతర బిజినెస్ లు అన్నీ కలిపి మరొక ₹1000 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని తెలుస్తుంది. ఇలా ఈయన హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు బిజినెస్ లు చూసుకుంటూ భారీగా సంపాదించారని,ఈయన మొత్తం ఆస్తులు విలువ కలిపి నాలుగు వేల కోట్లకు పైగా ఉంటాయని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…