Atiq Ahmed Murder : వేలకోట్ల ఆస్తులకు అధిపతి అతిక్… యూపిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలే…!

Atiq Ahmed Murder : ఉత్తర్ ప్రదేశ్ లోని మాజీ ఎంపీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ న్యూస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒకవైపు ఉత్తర్ ప్రదేశ్ లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం అంటూ అక్కడి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మరోవైపు యూపి సర్కార్ ఒక చీడ పురుగును తొలగించి మంచి పనిచేసిందంటూ ప్రశంసిస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరీ అతిక్ అహ్మద్ అంటే ఇతను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఎన్నికైన రాజకీయ నాయకుడిగా కంటే ముందు ఒక గ్యాంగ్స్టర్. ఉత్తర్ ప్రదేశ్ లో హత్యలు, భూ కబ్జాలు చేస్తూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. అతిక్ అహ్మద్ పైన దాదాపు 100 పెద్ద పెద్ధ కేసులే ఉండటం గమనార్హం. అలాంటి అతిక్ ను పోలీస్ స్టేషన్ ముందట అందరూ చూస్తుండగా కొందరు వ్యక్తులు కాల్చి చంపడం ఇప్పుడు వైరల్ అయింది.

అసద్ ఎన్కౌంటర్… ఇప్పుడు అతిక్ కాల్చివేత…

అతిక్ అహ్మద్ దందాలను చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ వేల కోట్లను సంపాదించాడు. మంచి వాల్యూ ఉన్న భూమి కనిపిస్తే చాలు వాళ్లను భయపెట్టి లేక కిడ్నాప్ చేసైనా సరే తక్కువ రేటుకే భూమిని లాగేసుకుంటాడు. ఇతని కంట పడిన కోటీశ్వరులైనా ఏమిచేయలేని పరిస్థితి. అతని మాట వినకపోతే చనిపోవడం ఖాయం. అతిక్ అహ్మద్ కి నలుగురు సంతానం కాగా అందులో అసద్ అనే వాడు తండ్రి జైలులో ఉన్న సమయంలో బయట దందాలను చేసేవాడు. అలానే ఒక బడా వ్యాపారిని బెదిరించి అతని బిల్డింగ్స్ రాయించుకున్నాడు. ఆ బడా వ్యాపారి కేసు పెట్టినా మూలయం ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. అయితే యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక సీన్ మారిపోయింది.

అతిక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాదినం చేసుకుంది. అక్కడ ప్లాట్స్ వేసి ప్రజలకు ఇవ్వనుంది. ఇక ఏప్రిల్ 13న అతిక్ కుమారుడు అసద్ ను పోలీసులు అధికారి ఉమేష్ హత్య కేసులో ఎన్కౌంటర్ చేసేసారు. ఆ అంత్యక్రియలకు కూడా అతిక్ వెళ్ళడానికి కుదరలేదు. అదే సమయంలో అతిక్ అతని సోదరుడు ఇద్దరూ పోలీసుల విచారణలో ఉన్నారు. ఇక వారిని జైలుకు తరలిస్తూ వైద్య పరీక్షల కోసం తీసుకుని వెళ్లగా అక్కడ మీడియా వాళ్ళు అతిక్ ను ప్రశ్నలు వేస్తుండగా జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొందరు వారిపై కాల్పులు జరిపి చంపేశారు. ఇక అతిక్ మరణంతో అతని బాధితులందరూ ఈడి ముందు బారులు తీరారు. కబ్జా చేసిన తమ ఆస్తులను ఇప్పించాలని కోరుతున్నారు.