మందుకోసం పోటెత్తిన జనం.. ఆగిపోయిన నెల్లూరు ఆయుర్వేద మందు పంపిణీ..! త్వరలో..

నెల్లూర్‌ జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. బోగిణి ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందును మొదట బ్రేకులు వేసిన ప్రభుత్వం… ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని తేలడంతో ఇవాళ నుంచి తిరిగి మందు పంపిణీ ప్రారంభించారు.

అయితే ప్రస్తుతం కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేశారు. ఆనందయ్య మందుకోసం ఏపీ, తెలంగాణ తో సహా ఇతర రాష్టాల నుండి జనం భారీగా తరలిరావడంతో పంపిణీ చాలా కష్టతరంగా మారింది. కోవిడ్ నేపధ్యంలో జనాలు భారీగా తరిలి రావడంవల్ల తాత్కాలికంగా కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే మందు తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం త్వరలో తేదీ తో సహా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు రేపటి నుంచి సువిశాలమైన మైదానంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి అధికారాలకు కోరారు.