నెల్లూర్ జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. బోగిణి ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందును మొదట బ్రేకులు వేసిన ప్రభుత్వం… ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని తేలడంతో ఇవాళ నుంచి తిరిగి మందు పంపిణీ ప్రారంభించారు.
అయితే ప్రస్తుతం కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేశారు. ఆనందయ్య మందుకోసం ఏపీ, తెలంగాణ తో సహా ఇతర రాష్టాల నుండి జనం భారీగా తరలిరావడంతో పంపిణీ చాలా కష్టతరంగా మారింది. కోవిడ్ నేపధ్యంలో జనాలు భారీగా తరిలి రావడంవల్ల తాత్కాలికంగా కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే మందు తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం త్వరలో తేదీ తో సహా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు రేపటి నుంచి సువిశాలమైన మైదానంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి అధికారాలకు కోరారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…