ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వారిలో పోలీసుల సేవలు ఎనలేనివని చెప్పవచ్చు. రాత్రనక పగలనక రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ విధులను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి వీలు దొరికినప్పుడల్లా కరోనా బాధితులకు సేవ చేస్తూ వారిలో ఉన్న సేవా గుణాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా పంజాగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేశ్‌కుమార్ తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. మహేష్ కుమార్ ఆదివారం రాత్రి 11గంటకు సోమాజిగూడలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఇద్దరు చిన్నారులు ఆకలితో ఆహారం కోసం యాచించడం చూసి చలించిపోయాడు. ఆ చిన్నారిని చూసి చలించిన మహేష్ కుమార్ తన కోసం తెచ్చుకున్న క్యారేజ్ స్వయంగా ఆ చిన్నారులకు వడ్డించి వారి ఆకలి తీర్చాడు.
చిన్నారుల పట్ల ఎంతో మానవత్వం చూపిన మహేష్ కుమార్ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లు పోలీస్ కానిస్టేబుల్ మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ స్పందిస్తూ… ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు.. నేను ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.కరోనా తర్వాత అతనిని వ్యక్తిగతంగా కలిసి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అంటూ ఆ దేవుడి ఆశీర్వాదం ఆయనపై తప్పకుండా ఉంటాయని కామెంట్ చేశారు. మరికొంత మంది నెటిజన్లు ఈయన మానవత్వానికి సలామ్ చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…