Babu Gogineni : బిగ్ బాస్ హోస్ ని బ్రోతల్ హౌస్ అంటావా.. ఖబడ్దార్ అంటూ రెచ్చిపోయిన బాబు గోగినేని…!

Babu gogineni : బిగ్ బాస్ షో అన్ని భాషలలోనూ టెలివిజన్ లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ షో నుండి బయటికి వచ్చాక కంటెస్టెంట్స్ ఫేమస్ అవడంతో మంచి ఆఫర్లు కూడా వచ్చి ఇండస్ట్రీ లో సెటిల్ అవుతారు. కానీ బిగ్ బాస్ షో ఎంతమంది చూస్తున్న ఆ షో చుట్టూ అన్నే వివాదాలు కూడా ప్రతి సీజన్ కు ఉంటాయి. విమర్శించేవాళ్ళు ప్రతిసారి ఈ షోను నిలిపివేయాలని చెబుతూనే ఉంటారు. ఇక అలాంటి వాళ్ళల్లో మనకు ముందుగా గుర్తొచ్చేది సిపిఐ నారాయణ గారూ. మొదటి నుండి బిగ్ బాస్ కార్యక్రమంను వ్యతిరేకిస్తున్న నారాయణ చాలా ఘాటుగా ఆ షో మీద విమర్శలు చేస్తుంటారు.

Babu Gogineni : బిగ్ బాస్ హోస్ ని బ్రోతల్ హౌస్ అంటావా.. ఖబడ్దార్ అంటూ రెచ్చిపోయిన బాబు గోగినేని…!

బ్రోతల్ హౌస్… వేశ్యలు అంటూ ఘాటు విమర్శలు…
బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌస్ మరియు రెడ్ లైట్ ఏరియా అంటూ విమర్శిస్తుంటారు సిపిఐ నారాయణ ఇక హైకోర్ట్ లో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసారు. ఇక హై కోర్ట్ దీనిపై స్పందిస్తూ ఈ కార్యక్రమం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతాయని వాఖ్యాణించడంతో ఆ షోను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ నారాయణ హై కోర్ట్ ను కోరారు. ఇక ఈ విషయం గురించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని ఫైర్ అయ్యాడు సిపిఐ నారాయణపై ఘాటు విమర్శలు చేసారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వేశ్యలా… ఖబడ్దార్….

బిగ్ బాస్ షో మీకు నచ్చక పోతే చూడడం ఆపేయండి, వేరే ఛానల్ మార్చుకోండి, వాకింగ్ వెళ్లడమో పుస్తకం చదవడం ఎలా ఏదైనా చేసుకొండి అంతే గాని బిగ్ బాస్ షో లో ఏమి అనైతిక పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో మనుషులను పొడవడం, కళ్ళనుండి రక్తం కారడం వంటి హింస చూపించారు అలాంటి హింస బిగ్ బాస్ లో ఏమైనా ఉందా… శృంగారం ఏమైనా చూపిస్తున్నారా…. అడల్ట్ కంటెంట్ అనడానికి…బూతులు వాడుతుంటే ఎడిట్ చేయమని కోరవచ్చు. అయినా మీకు తెలియని బూతులు ఏమి మాట్లాడుతున్నారు అక్కడ? రాజకీయ నాయకులకు పబ్లిక్ లో మాట్లాడని భాషా అది… తెలుగు బిగ్ బాస్ లో అసలు మీకు అలాంటివి ఏమి కనిపించాయి అంటూ ఫైర్ అయ్యారు.

24 గంటల ప్రోగ్రామ్ పెట్టమన్నారు, ఏమి చూద్దాము అన్న వింత కోరికతో అడిగారు?. అలాంటి ఆలోచనలు ఎందుకు మీకే వస్తున్నాయి. ఇప్పుడు నిద్ర మానేసి మరీ 24 గంటలూ చూస్తున్నారు? ఎందుకో మరి? చూస్తుంటే ఏమి కనిపిస్తోందో మీకు ? 90 కెమెరాల సాక్షిగా, వందల మంది ఉద్యోగులు చూస్తూ ఉండగా జరిగే ఆట అని తెలుసుకునే ఇంగితం కూడా లేదా? నైతిక విలువలు అడుగంటి పోతున్నాయంటూ కోర్టుకు వెళ్లారు . ఏ చట్టం ఉల్లఘించబడింది? అంటూ ప్రశ్నించారు.
కొంత మందికి షో నచ్చక పోవచ్చు చాలా మంది ప్రేక్షకులు షోను ఆదరిస్తున్నారు. మరియు కోర్టుల పని ఏమిటి చట్టబద్ధమైన, న్యాయ బద్ధమైన తీర్పులు ఇవ్వడమా లేక నైతిక అంశాల మీద వ్యక్తిగత అభిప్రాయాలకు లోబడి తీర్పులు ఇవ్వడమా అని అంటూనే పిల్లలకు ఈ కార్యక్రమం చూపించకూడదు అనుకుంటే ఆ తల్లిదండ్రులు నిబంధనలు వారి ఇంట్లో పెట్టుకోవచ్చు అంతే కానీ మీకు ఏమి పని సంస్కారం లేకుండా బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ అని అందులో ఉన్న 30కి పైగా లేడీ కంటెస్టెంట్స్ ను వేశ్యలతో పోల్చారు ఆలా అయితే అందులోని మగవారు విటులా..? ఖబడ్దార్ నారాయణ అంటూ మండిపడ్డాడు బాబు గోగినేని.