Varun tej : మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో వరుణ్ తేజ్ అందరిలాగా మాస్ జోనర్ లోనో లేక లవర్స్ బాయ్ గానో సినిమాలు చేయకుండా కథకి బలమున్న సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా వరుణ్ నటించిన తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా గని పరాజయం పాలైంది. మరోసారి వెంకటేష్ తో కలిసి ఫన్ అండ్ ఫ్రస్ట్రేట్ చేయడానికి ఈ నెల సిద్ధమవుతున్నారు. ఇక వరుణ్ పెళ్లి గురించి హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంటూ తరచూ వస్తున్న వార్తలు వరుణ్ తల్లి పద్మజ, చెల్లి నిహారిక వాఖ్యలతో మరోసారి చర్చలకు దారి తీసాయి.
లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం….
వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లపై ఎపుడు స్పందించలేదు. వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. ఇటీవల గని సినిమా విడుదల సమయంలో లావణ్య, వరుణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మరోసారి అనుమానం రేపింది. ఇక వరుణ్ తన పుట్టినరోజున లావణ్యను కలవడం వంటివి ఇంకా అనుమానాలు పెంచాయి.
హీరోయిన్ నా కోడలిగా వచ్చినా అభ్యంతరం లేదు….
ఇక ఇటీవల నాగబాబు భార్య, నాగబాబు కూతురు నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వరుణ్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. వరుణ్ తల్లి పద్మజ తన కొడుకు ఎవరిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని ఒకవేళ ఎవరైనా హీరోయిన్ ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నాకేటువంటి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాను సంబంధాలు చూస్తున్నట్లు వివరించారు. ఇక నిహారిక మాట్లాడుతూ నాకే ప్రేమా పెళ్ళికి అవకాశం దక్కలేదని అన్నారు. అంటే మీ ప్రేమను పెద్దలు కాదన్నారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు అసలు ప్రేమించడానికి అలాంటి అబ్బాయ్ దొరకలేదని ఇంట్లో అమ్మ నాన్న ఎపుడు ఆలా ప్రవర్తించలేదంటూ నిహారిక భర్త చైతన్య, వరుణ్ కలిసి స్కూల్ లో చదువుకున్నారని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇక వీళ్ళ మాటలు వింటుంటే వరుణ్ పెళ్లి లావణ్యతో జరుగుతుందనే ఊహగానాలు బలపడుతున్నాయి. త్వరలోనే పెళ్లి భాజాలు మొగేలా ఉన్నాయి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…