Niharika : కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్యే మళ్ళీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. జిమ్ వీడియోతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసిన నిహారిక, ఆ తరువాత పబ్ లో పోలీసుల దాడి లో దొరికి వార్తల్లో నానింది. ఇక పబ్ ఉదంతంలో డ్రగ్స్ పట్టుబడడంతో ఇంకాస్త నెగెటివ్ ప్రచారం నిహారికపై వచ్చింది. ఈ సంఘటనల అనంతరం నిహారిక బయట కనిపించలేదు. ఇక నాగబాబును పొలిటికల్ గా బాగా విమర్శించారు. కూతురికి పద్దతి నేర్పించమంటూ ఘాటుగా కామెంట్స్ చేసారు శ్రీ రెడ్డి వంటి వారు.
మా బావగారు ఉండగా మాకేం భయం లేదు….
ఇటీవల మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక భర్తతో కలిసి విహార యాత్రలకు విదేశాలకు వెళ్లి అక్కడ ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేసింది. రీసెంట్ గా మదర్స్ డే నాడు తన తల్లితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిహారిక. పద్మజ గారిని నిహారిక పై వచ్చిన నెగెటివిటీపై ఎలా ఫీలయ్యారు అని అడుగగా మొదట్లో కొద్దిగా బాధేసిన తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడాలి అని అనుకున్నట్లు తెలిపారు. ఇక ఏ విషయంలోనూ భయపడే అవసరమూ మాకు లేదని మా బావగారు మాకు అండగా ఉండగా దేని గురించి ఆలోచించమంటూ పద్మజ గార పేర్కొన్నారు.
ఇక నిహారిక పై వచ్చిన నెగెటివిటీ గురించి నిహారిక మాట్లాడుతూ అసలు సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కామెంట్స్ అసలు చూడనని, న్యూస్ వంటివి టీవిలో చూడనని, యూట్యూబ్ థంబ్ నైల్స్ వంటివి అసలు పట్టించుకోనని ఇక నాపై వచ్చే నెగెటివ్ కామెట్స్ అసలు పట్టించుకోనని నాకసలు అవి ఫరక్ పడవంటూ తెల్చేసింది. నా ముందు వచ్చి నా గురించి మాట్లాడారు కదా ఒకవేళ మాట్లాడితే కొట్టేస్తా కదా అంటూ సరదాగా చెప్పింది నిహారిక.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…