Babu Mohan : నాకు కోటన్నకి మధ్య గొడవలపై క్లారిటీ ఇస్తున్నా… మా అమ్మను తిడితే ఊరుకుంటానా కిందపడేసి పిచ్చకొట్టుడు కొట్టాను : బాబు మోహన్

Babu Mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆహుతి, అంకుశం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని చాలా తక్కువ సమయంలో కమెడియన్ గా బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు బాబు మోహన్. కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి అప్పట్లో ప్రతి సినిమాలోనూ ఉండేది. ప్రతి సినిమాకు వీళ్ళిద్దరూ హిట్ కాంబినేషన్. ఇక బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబినేషన్ కూడా బాగా హిట్ అయింది. ఇక అప్పట్లో కచ్చితంగా సినిమాల్లో బాబు మోహన్ కి పాట పెట్టడం ఆనవాయితీ అయిపోయింది. చాలా బిజీ ఆర్టిస్ట్ గా ఒకే రోజు 14 మంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకున్న ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు.

కోటన్నకి నాకు మధ్య విభేదాలు…

అప్పటి సినిమాల్లో కోట, బాబు మోహన్ కాంబినేషన్ అంటే హిట్ పెయిర్. ప్రతి సినిమాలో ఈ కాంబినేషన్ ఉండాల్సిందే. అంతలా వీళ్ళ పెయిర్ హిట్ అయింది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి అలాంటప్పుడు విభేదాలు కూడా ఉండి ఉంటాయి అనే విషయంలో బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు. అన్నదమ్ములు, తల్లి పిల్లలు, భార్య భర్తల మధ్య గొడవలు సహజం అలాంటిది అన్నేళ్లు కలిసి పనిచేసినపుడు గొడవలు సహజమే కదా. చిన్న చిన్న గొడవలు, విభేదాలు మా మధ్య కూడా వచ్చాయి. నాకు కోటన్నకి, నాకు బ్రహ్మానందం ఇలా కొన్నిసార్లు విభేదాలు వచ్చినా అవి ఎక్కువ కాలం లేవు. మేము ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. బ్రహ్మనందం కన్నా బాగా చేయాలి, కోటన్న కన్నా బాగా చేయాలి అని కసితో నటించేవాడిని. మా మధ్య అలాంటి పోటీ ఉండేది అంతే కానీ ఇంక వేరే గొడవలు లేవు అంటూ చెప్పారు.

ఇక ఆరోతరగతి ఖమ్మం లో చదివే సమయంలో తల్లి లేకపోవడంతో ఎపుడూ ఏడ్చేవారట బాబు మోహన్. క్లాస్ లీడర్ గా ఉండి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడట అయినా కూడా అందరూ ఎపుడూ ఏడుస్తూ ఉంటాడని ఏడిపించేవారట. అయితే ఒక రోజు ఒక అగ్రకులం వాడు నీయమ్మ అని తిట్టేసరికి బాగా కోపం వచ్చి స్కూల్ అయిపోయాక కిందపడేసి మా అమ్మాను అంటావా అని చిత్తక్కకొట్టుడు కొట్టాడట బాబు మోహన్, ఇలా తన అనుభవాలను ఆయన పంచుకున్నారు.