‘కొరటాల శివ’కు బ్యాడ్ టైం నడుస్తుందా..??

తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయిత నుండి దర్శకుడిగా మారాడు ‘కొరటాల శివ’.ప్రభాస్ హీరోగా ‘మిర్చి’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ.. మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు.ఇక చివరిగా భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకులని అలరించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు..

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. అంతేకాకుండా ఓ కీలక పాత్రలో మెగా వారసుడు రామ్ చరణ్ సైతం ఈ సినిమాలో కనిపించనున్నాడు.. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది.

ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్లుగా సమయం కేటాయించాడు కొరటాల.ఈ సినిమా ఆలస్యానికి కరోనా ఒక కారణమైతే మరోవైపు ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ బిజీగా ఉండడం కూడా మరో కారణం అని అంటున్నారు.ముందుగా ఆచార్యలో రామ్ చరణ్ పాత్రలో మహేష్‌ని అనుకున్నారు. కాని అనుకోకుండా రామ్ చరణ్ వచ్చాడు. ఆయన వలన షూటింగ్ మరింత ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. ఇక బన్నీతో సినిమా చేయాలని కొరటాల భావించగా, అది ఇప్పట్లో కుదిరేలా లేదు.ఇక ఎన్టీఆర్‌తో ఇటీవల సినిమా కన్‌ఫాం చేశాడు.

మరి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుండి బయటకు వస్తాడు, కొరటాలతో ఎప్పుడు సినిమా చేస్తాడన్నది ప్రశ్నార్దకంగా మారింది.ఈ నేపథ్యంలోనే అటు ఆచార్య విడుదల కాకపోవడం, ఇటు ఎన్టీఆర్ RRR నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు.. ఒకవేళ వచ్చినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలంటే చాలా కష్టం.. కాబట్టి ప్రస్తుతం కొరటాల శివకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని అంటున్నారు విశ్లేషకులు…!!