ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ క్రమంలోనే మరి కొందరు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ పత్రాలు సృష్టించి
కొవిడ్ సహాయ నిధిని పొంది, లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన వ్యక్తి చివరికి కటకటాల పాలైన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
కాలిఫోర్నియాకు చెందిన ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే అక్కడి ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయ నిధులు ప్రకటించింది. ముస్తఫా తన అతి తెలివితేటలు ప్రదర్శించి నకిలీ పత్రాలను సృష్టించాడు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా తనకు ఒక కంపెనీ ఉందని ప్రస్తుత పరిస్థితుల వల్ల తను ఎంతో నష్టపోయానని తెలుపుతూ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విధంగా నకిలీ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న ముస్తఫా కొవిడ్ సహాయ నిధిని పొందాడు. అనంతరం సహాయ నిధి ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లను కొనుగోలు చేసాడు. అధికారులు ఎంక్వయిరీ కోసం అతని ఇంటికి వెళ్లగా అతని ఇంటి ఆవరణంలో ఉన్న కార్లను చూసి అధికారులు ఖంగుతిన్నారు.
అనంతరం విచారణ చేపట్టిన అధికారులు ముస్తఫా ఫై పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ముస్తఫాను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అతని దగ్గర నుంచి కార్ల తో పాటు 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…