General News

చెట్టుపైనే అన్నీ… భోజనం, నిద్ర అన్ని అక్కడే.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొల్పింది.కొందరు కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మరికొందరు కరోనా బారిన పడి తమ కుటుంబానికి సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన ఓ వ్యక్తి తమ కుటుంబానికి కరోనా రాకూడదనే ఉద్దేశంతో ఏకంగా చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోని గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా బారిన పడ్డాడు.ఈ క్రమంలోనే శివ తన ద్వారా తన ఇంట్లో వారికి కరోనా సోకు కూడదని భావించడంతో హోమ్ ఐసోలేషన్ అయ్యాడు. అయితే వారి ఇల్లు చిన్నదిగా ఉండటంతో ప్రత్యేక గది లేకపోవటం వల్ల శివ తన ఇంటి ముందు ఉన్న ఒక చెట్టు పై తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

చెట్టుపై కొమ్మకు మంచం కట్టి అక్కడే ఐసోలేషన్ అయ్యాడు. తమ కుటుంబం అతనికి కింది నుంచి నీటిని ఆహారాన్ని పంపిస్తుంది.శివ కుటుంబంలో మిగిలిన నలుగురు కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా తన మాత్రం చెట్టుపై ఐసోలేషన్ అయ్యాడు. గత తొమ్మిది రోజుల నుంచి అతనికి నిద్ర, ఆహారం, అన్ని ఈ చెట్టు పైనే. ఇంట్లో ప్రత్యేకంగా ఉండటానికి గది లేక పోవటం వల్లనే ఈ విధంగా చెట్టుపై ఉంటూ ఈ వ్యాధి మరొకరికి సోకకుండా జాగ్రత్త పడుతున్నట్లు శివ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కేదార్‌నాథ్‌లో కఠిన నిబంధనలు.. ఫోటోలు, రీల్స్‌కు పూర్తి నిషేధం!

హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…

3 minutes ago

డబ్బు సమస్యల నుంచి బయటపడాలా? గురువారం ఈ ఆచారాలు ట్రై చేయండి!

జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…

11 minutes ago

గోండ్ vs గోండ్ కటిరా..! ఏది వేడి, ఏది చల్లదనం ఇస్తుందో తెలుసా?

ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…

18 minutes ago

కళ్లద్దాలకు గుడ్‌బై..! లాసిక్‌తో క్లియర్ విజన్ సాధ్యం!

ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…

26 minutes ago

మాటల కంటే మౌనం గొప్పది..! చాణక్యుడి ఐదు కీలక జీవన సూత్రాలు!

ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…

34 minutes ago

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

2 hours ago