సినీ పరిశ్రమను తీవ్ర విషాధాలు అలుముకుంటున్నాయి.ఒక వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, మరోవైపు సినీ పరిశ్రమ అగ్ర నటీ నటులని కోల్పోవడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు గురి చేస్తోంది.. ఇక ముఖ్యంగాటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందారు.
కేవలం తెలుగు పరిశ్రమలోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మళయాలం ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సూపర్ హిట్ సినిమా తొలిప్రేమలో హీరోయిన్గా నటించిన కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కేశ్ పల్లి (గడ్డం) ఆనంద రెడ్డి గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.
కీర్తీ రెడ్డి.. ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గన్ షాట్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. తెలుగుతోపాటు పలు తమిళ, హిందీ సినిమాల్లో కూడా కీర్తీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్’ అనే సినిమాలో ఆమె చివరిసారిగా నటించింది. ఇక ఇదే సినిమాకు కీర్తీ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.
ఇదిలా ఉంటే ఆమె తండ్రి ఆనంద రెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి తనయుడు. ముందుగా యూత్ లీడర్ గా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 2014లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆనంద రెడ్డి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కీర్తీ రెడ్డి.. టాలీవుడ్ హీరో సుమంత్ తో వివాహం జరిగింది. కానీ త్వరాత వీరిద్ధరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో నివసిస్తున్నట్లు సమాచారం..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…