టాలీవుడ్ లో మరో విషాదం.. గుండెపోటుతో పవన్ హీరోయిన్ తండ్రి మృతి..!!

0
41

సినీ పరిశ్రమను తీవ్ర విషాధాలు అలుముకుంటున్నాయి.ఒక వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, మరోవైపు సినీ పరిశ్రమ అగ్ర నటీ నటులని కోల్పోవడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు గురి చేస్తోంది.. ఇక ముఖ్యంగాటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందారు.

కేవలం తెలుగు పరిశ్రమలోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మళయాలం ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సూపర్ హిట్ సినిమా తొలిప్రేమలో హీరోయిన్‏గా నటించిన కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కేశ్ పల్లి (గడ్డం) ఆనంద రెడ్డి గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.

కీర్తీ రెడ్డి.. ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గన్ షాట్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. తెలుగుతోపాటు పలు తమిళ, హిందీ సినిమాల్లో కూడా కీర్తీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్’ అనే సినిమాలో ఆమె చివరిసారిగా నటించింది. ఇక ఇదే సినిమాకు కీర్తీ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

ఇదిలా ఉంటే ఆమె తండ్రి ఆనంద రెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి తనయుడు. ముందుగా యూత్ లీడర్ గా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 2014లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆనంద రెడ్డి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కీర్తీ రెడ్డి.. టాలీవుడ్ హీరో సుమంత్ తో వివాహం జరిగింది. కానీ త్వరాత వీరిద్ధరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో నివసిస్తున్నట్లు సమాచారం..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here