చెట్టుపైనే అన్నీ… భోజనం, నిద్ర అన్ని అక్కడే.. ఎందుకంటే?

0
47

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొల్పింది.కొందరు కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మరికొందరు కరోనా బారిన పడి తమ కుటుంబానికి సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన ఓ వ్యక్తి తమ కుటుంబానికి కరోనా రాకూడదనే ఉద్దేశంతో ఏకంగా చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోని గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా బారిన పడ్డాడు.ఈ క్రమంలోనే శివ తన ద్వారా తన ఇంట్లో వారికి కరోనా సోకు కూడదని భావించడంతో హోమ్ ఐసోలేషన్ అయ్యాడు. అయితే వారి ఇల్లు చిన్నదిగా ఉండటంతో ప్రత్యేక గది లేకపోవటం వల్ల శివ తన ఇంటి ముందు ఉన్న ఒక చెట్టు పై తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

చెట్టుపై కొమ్మకు మంచం కట్టి అక్కడే ఐసోలేషన్ అయ్యాడు. తమ కుటుంబం అతనికి కింది నుంచి నీటిని ఆహారాన్ని పంపిస్తుంది.శివ కుటుంబంలో మిగిలిన నలుగురు కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా తన మాత్రం చెట్టుపై ఐసోలేషన్ అయ్యాడు. గత తొమ్మిది రోజుల నుంచి అతనికి నిద్ర, ఆహారం, అన్ని ఈ చెట్టు పైనే. ఇంట్లో ప్రత్యేకంగా ఉండటానికి గది లేక పోవటం వల్లనే ఈ విధంగా చెట్టుపై ఉంటూ ఈ వ్యాధి మరొకరికి సోకకుండా జాగ్రత్త పడుతున్నట్లు శివ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here