కరోనా ఫండ్ తో ఖరీదైన కార్లు కొన్నాడు.. చివరికి?

0
43

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ క్రమంలోనే మరి కొందరు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ పత్రాలు సృష్టించి
కొవిడ్ సహాయ నిధిని పొంది, లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన వ్యక్తి చివరికి కటకటాల పాలైన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…

కాలిఫోర్నియాకు చెందిన ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే అక్కడి ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయ నిధులు ప్రకటించింది. ముస్తఫా తన అతి తెలివితేటలు ప్రదర్శించి నకిలీ పత్రాలను సృష్టించాడు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా తనకు ఒక కంపెనీ ఉందని ప్రస్తుత పరిస్థితుల వల్ల తను ఎంతో నష్టపోయానని తెలుపుతూ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ విధంగా నకిలీ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న ముస్తఫా కొవిడ్ సహాయ నిధిని పొందాడు. అనంతరం సహాయ నిధి ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లను కొనుగోలు చేసాడు. అధికారులు ఎంక్వయిరీ కోసం అతని ఇంటికి వెళ్లగా అతని ఇంటి ఆవరణంలో ఉన్న కార్లను చూసి అధికారులు ఖంగుతిన్నారు.

అనంతరం విచారణ చేపట్టిన అధికారులు ముస్తఫా ఫై పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ముస్తఫాను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అతని దగ్గర నుంచి కార్ల తో పాటు 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here