Balagam fame Lalitha Chiranjeevi : నేను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్… ఆర్థికంగ బాగా ఇబ్బందులు…: బలగం ఫేమ్ లలిత చిరంజీవి

Balagam fame Lalitha Chiranjeevi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు వచ్చింది. అలా సినిమాలో హీరో పిన్నిగా గయ్యాళి పాత్రలో నటించిన లలిత చిరంజీవి గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ గురించి మాట్లాడారు.

నాకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు…

లలిత చిరంజీవి గారు సురభి కళాకారిణి. చిన్నతనం నుండి సురభి నాటక మండలిలో పనిచేస్తూ నటనలో ఆరితేరిన లలిత గారు సినిమాల్లో ప్రయత్నించాలని చాలా అనుకున్నా మనం వెళ్ళగలమా అని కొన్ని ఆడిషన్స్ ఇచ్చినా కూడా అవకాశాలు రాకపోవడంతో ఇక వాటి మీద ఆశలు వదిలేసానని చెప్పిన ఆమె తన తల్లిదండ్రులు అన్న కూడా సురభి కళాకారులే అంటూ తెలిపారు. నాటక రంగం నుండి రావడం వల్ల సినిమాలో నటన సులభంగా ఉంటుందని చెప్పిన ఆమె ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా అనే ప్రశ్నకు అన్ని చోట్ల అది ఉంటుంది కాకపోతే మనం వెళ్లే మార్గం బట్టే మనకు ఎదురవడం లేకపోవడం ఉంటాయి. చాలా మంది అడిగారు ఇంత పెద బ్యానర్ లో సినిమా అవకాశం వచ్చింది మరి నిన్ను వేరే ఏమీ అడగలేదా అంటూ అనేవారు. అలాంటివి ఉంటాయి.

అయితే వాటిని తప్పు అనను కరెక్ట్ అని చెప్పను. అవకాశం ఎలాగైనా కావాలి అనుకున్నపుడు ఇటువైపు నుండే ఆసక్తి చూపొచ్చు లేదా వాళ్ళు అడిగినపుడు కాదు అనకపోవచ్చు. అయితే నాకు ఇంతవరకు అలాంటివి ఎదురుపడలేదు, నాకు అలాంటి అవకాశాలు వద్దు. మనకు తెలిసిపోతుంది ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టే దూరం జరుగుతాము అంటూ తెలిపారు. ఇక చిన్న వయసులోనే తన తండ్రి మరణించడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం, అమ్మే అన్నీ చూసుకుంది. తనకు లోకం పెద్దగా తెలియకపోయినా మమల్ని పెంచి పెద్ద చేసింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని అందరూ గుర్తు పట్టి అడుగుతున్నారంటూ తెలిపారు.