అరటిపండు తొక్కతో పులిపిర్లు మాయం.. ఎలా అంటే?

కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. అరటిపండుని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది. అయితే చాలామంది అరటి పండును మాత్రమే తిని తొక్కను పక్కన పెట్టేస్తుంటారు.

నిజానికి అరటిపండులో కన్నా తొక్కలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా మనలో చాలామంది పులిపిరి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. అయితే వీటిని తొలగించే క్రమంలో నొప్పి కలగడం వల్ల చాలామంది వీటిని వదిలేస్తుంటారు.

పులిపిరి మొహంపై లేదా ముక్కు పై ఉంటే చూడటానికి ఎంతో అసభ్యంగా ఉంటుంది. కనుక ఈ విధమైన సమస్యతో బాధపడేవారికి అరటిపండు తొక్క ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా పులిపిరి సమస్యతో బాధపడేవారు అరటిపండు తొక్క ని తీసుకొని పులిపిరి పై ఉంచి బాండేజ్ వేయాలి.ఈ విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల మన మొహం పై ఉన్న పులిపిరి వాటంతట అవే తగ్గిపోతాయి.

అరటిపండు తొక్కలలో ఎక్కువ భాగం యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల అవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మన చర్మం పై ఏర్పడిన మచ్చలు, ముడతలను తొలగించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకపాత్ర వహిస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ప్రతి రోజూ ఒక అరగంట పాటు మొహంపై మసాజ్ చేసుకుని, మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.