ఆర్బీఐ కొత్త రూల్స్.. ఏటీఎంలో డబ్బు లేకపోయిన.. కట్ చేసిన మనీ 7 రోజుల్లో రాకపోయిన.. ఇకపై..

చాలా మందికి డబ్బులు తీసుకుందామని ఏటీఎం సెంటర్ల వద్దకు వెళితే ‘నో మనీ’ అని చూపిస్తుంటుంది. చాలా ఏటీఎంల వద్ద అందరికి ఇలాంటి అనుభవం ఎదరవుతుంటుంది. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సాధించింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బుల లేమి వినియోగదారుల తప్పు కాదని, బ్యాంకర్ల తప్పు అని అభిప్రాయపడింది. దీంతో రిజర్వ్ బ్యాంకు పలు సూచనలు జారీ చేసింది. ఏ ఏటీఎం సెంటర్‌లోనైనా డబ్బులు లేకపోతే సంబంధిత బ్యాంకుకు జరిమానా విధించబడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ నిబంధన అక్టోబర్ 1వ అమల్లోకి రానుంది. ఏటీఎం మెషీన్లు పనిచేయకపోయినా, వాటిల్లో నో క్యాష్ అని కనిపించిన దాన్ని తీవ్రంగా పరిగణించబడిజరిమానలు విధిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయకుండానే ఖాతా డబ్బులు కట్ చేయడంపై కూడా ఆర్బీఐ సమీక్షించింది. కట్ చేసిన అమౌంట్‌ను 7 రోజుల్లోగా 7 రోజుల్లోగా తిరిగి వినియోదారుడి ఖాతకు జమా కాకపోతే.. సదరు కస్టమర్‌కు బ్యాంక్ ప్రతీ రోజూ రూ. 100 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.