Benarjee : మోహన్ బాబు నన్ను బూతులు తిట్టి, కొట్టడానికి వచ్చాడు… ఆ విషయం ఆయన విజ్ఞతకు వదిలేసాను : బెనర్జీ

Benarjee : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను విభిన్నమైన పాత్రలతో మెప్పించిన నటుడు బెనర్జీ. అసలు సినిమా ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చారు ఎలా నటుడు అయ్యారు అనే విషయాలను అలాగే మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, మోహనబాబు బెనర్జీ ని తిట్టడం, చేయి చేసుకోవడం వంటి విషయాల గురించి మళ్ళీ ఇన్నాళ్లకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లో వస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పాల్గొని మాట్లాడారు. ఇక మోహన్ బాబు తన విషయంలో ప్రవవర్తించిన తీరుని తలుచుకొని కంట తడి పెట్టుకున్నారు.

డైరెక్టర్ అవ్వాలని వచ్చి నటుడిగా…

సినిమా ఇండస్ట్రీ కి డైరెక్టర్ అవ్వాలని వచ్చి అమితాబ్ బచ్చన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఒక కన్నడ నటుడు సమయానికి షూటింగ్ కి రాకపోవడంతో నన్ను ఆ పాత్ర చేయమనడంతో అలా నటుడిని అయ్యానని బెనర్జీ చెప్పారు. ఇక తాను ఎన్ని సినిమాలు చేసానో లెక్కబెట్టుకోనని ఇంట్లో సినిమాల ప్రస్తావన ఉండదని టీవీ చూడటం, పేపర్ చదవడం ఏమి ఇంట్లో ఉండవని చెప్పారు. ఇక మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలు గురించి రాధ కృష్ణ అడిగినపుడు బెనర్జీ మోహన్ బాబు ప్రస్తావన రాగానే కంటతడి పెట్టుకున్నారు.

మిమ్మల్ని మోహన్ బాబు కొట్టారనే వార్తలు అప్పట్లో వినిపించాయి అలా ఎందుకు జరిగింది అని అడుగుగా ఆ విషయం ఆయన విజ్ఞత కే వదిలేస్తున్నాను అంటూ చెప్పారు. నిజానికి మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబెర్ అయిన తనీష్ ని విష్ణు ప్యానెల్ వాళ్ళు తిడుతుండగా గొడవలొద్దని మంచు విష్ణు తో బెనర్జీ మాట్లాడుతున్న సమయంలో మోహనబాబు వచ్చి బెనర్జీని బూతులు తిట్టారు, అలాగే చేయి చేసుకోబోయాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నలభై ఏళ్ళు ఇండస్ట్రీ లో ఉన్న నన్ను అలా ఆయన తిట్టే సరికి షాక్ అయ్యాను అంటూ బెనర్జీ మీడియాలో కూడా ఆ సంఘటన వివరించారు.