Covid Vaccine: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకాకు డీసీజీఐ ఆమోదం..!

Covid Vaccine:దాదాపుగా గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలు అన్నింటినీ ఇబ్బంది పెడుతున్న సమస్య కరోనా వైరస్. దీని ప్రభావం తగ్గుతుందనే లోపు ఏవో ఒక వేరియంట్లో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు మూడవ వేవ్ లో ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. అయితే రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ చేసిన నష్టాన్ని ఇప్పుడైతే ఇది చేయట్లేదు. మరణాల రేటు చాలా తక్కువగా నమోదు అవుతుంది.

ఇది ఒక రకంగా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ వల్లనే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ల సంఖ్య 150 కోట్లు దాటింది. అయితే ఇప్పుడు హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు, ఇంకా దరఖాస్తు చేసుకున్న వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. దీనిని కరోనా ప్రికాషనరి డోస్ అని కూడా అంటారు.

ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేల భారత్ బయోటెక్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ 3 వారాల క్రితం బూస్టర్ డోస్ లాగా ఉపయోగపడే చుక్కల మందును అప్రూవల్ కోసం అప్లై చేయడం జరిగింది. భారత్ బయోటెక్ కనిపెట్టిన చుక్కల ముందుకు క్లినికల్ ట్రయల్స్ చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నారు.

బూస్టర్ డోస్ లో భాగంగా చుక్కల మందు..

ఈ ట్రయల్స్ ను దాదాపుగా 900 మంది మీద ప్రయోగించనున్నారు. ఫేస్ 3 బూస్టర్ డోస్ లో భాగంగా DCGI నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన రెండవ కంపెనీ ఇదే కావడం విశేషం. ఇదివరకే రెండు డోసుల కోవాక్సిన్ లేదా కోవిషిల్డ్ తీసుకున్న వారికి ఈ చుక్కల మందు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత్ బయోటెక్ వివరించింది. ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా త్వరగా ట్రయల్స్ జరిపి ఈ చుక్కల మందులను త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ సంస్థ ఆలోచన.