Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..

Srirama Chandra: తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా.. మొత్తానికి చివరకు 5గురు టాప్ లో ఉన్న వారిలో సన్నీ విజేతగా నిలిచాడు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు చెప్పిన శ్రీరామచంద్ర టాప్ 3లో నిలిచాడు.

Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..
Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..

అక్కడ డబ్బులను ఆశగా చూపించినా.. శ్రీరామచంద్ర లొంగకుండా.. అలానే ఉన్నాడు. చివరకు బయటకు వచ్చిన తర్వాత అతడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యాడు. తాను అనుకున్నది సాధించినట్లు పేర్కొన్నాడు శ్రీరామ్. ఇక తాజాగా అతడు.. బంపర్ ఆఫర్ ను కొట్టేశాడు. ఏకంగా మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో బిగ్గెస్ట్ స్టేజ్ షోను నిర్వహించబోతోన్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.

Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..

సుదీర్ఘకాలం పాటు సాగే స్టేజ్ షో ఇది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఓ గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు శ్రీరామచంద్ర. గతంలో ఇండియన్ ఐడల్ 5 విజేతగా నిలిచిన శ్రీరామ్ కి ఇప్పుడు ఆ ఆఫర్ రావడంతో అతడి అభిమానులతో పాటు అతడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ బిగ్గెస్ట్ స్టేజ్ షోను సమర్థవంతంగా నడిపించడానికి పాటపై మంచి పట్టు ఉండాలి. ఆ అర్హత ఉన్న ఏకైక సింగర్‌గా శ్రీరామచంద్రను గుర్తించింది ఆహా మేనేజ్‌మెంట్. అందుకే అతడికి సెలెక్ట్ చేసినట్లు తెలిపారు.

తెలుగులో మొదటిసారి ప్రారంభమవుతున్న అద్భుతమైన కార్యక్రమం:

ఇక ఆహా ఓటీటీ గురించి చెప్పుకుంటే.. ఎన్నో వెబ్ సిరీస్ లు, టాక్ షోలు , రియాల్టీ షోలతో దూసుకుపోతోంది. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ స్టార్ట్ చేసి క్రేజీ రెస్పాన్స్ ను దక్కించుకుంది ‘ఆహా’. ఇక తాజగా తెలుగు ఇండియన్ ఐడల్ ను మొదలు పెట్టి.. యంగ్ సింగర్స్ కోసం ఓ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో పాల్గొనేవారికి 14 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులుగా పేర్కొన్నారు. పాల్గొనదలిచిన వారు తెలుగు పాటలు మాత్రమే పాడాల్సి ఉంటుంది. సీజన్ 1లో పాల్గొనడానికి ఎలాంటి ప్రీ-రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్నొన్నారు. హిందీలో సోనీ టీవీ ఇండియన్ ఐడల్ 12 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. దేశంలో మారుమూల గ్రామాల్లో ఉన్న సింగర్స్‌ను గుర్తించడానికి ఈ షోను నిర్వహిస్తూ వస్తోంది ఛానల్ యాజమాన్యం. ప్రస్తుతం తెలుగులో మొదటిసారిగా ఆహా యజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.