Brahmanandam: కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ బ్రహ్మానందం సంపాదించిన ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Brahmanandam: వెండి తెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు బ్రహ్మానందం ఒకరు. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా ఏ హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు కాదు.కొన్ని సినిమాలు ఈయన కామెడీ ద్వారానే హిట్ అయ్యాయి అంటే కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.ఇలా కమెడియన్ గా తన ముఖ కవళికలతోనూ మాట తీరుతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నారు.

వయసు పై పడటంతో ఈయన చాలా తక్కువ సినిమాలలో నటిస్తూ ఉన్నారు.ఇండస్ట్రీలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న బ్రహ్మానందం నాటకాలపై ఎంతో ఆసక్తి చూపించేవారు. ఈ క్రమంలోనే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చారు.అహనా పెళ్ళంట సినిమాతో వెండితెరకు పరిచయమైనటువంటి బ్రహ్మానందం తన సినీ కెరియర్ల సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించారు.

ఈయన ఒక్కో కాల్ షీట్ కు లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇలా బ్రహ్మానందం ఒక్కో సినిమాకి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఈయన భారీ మొత్తంలోనే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.

Brahmanandam: హీరోలను తలదన్నేలా ఆస్తులు కూడా పెట్టిన బ్రహ్మానందం…


సాధారణం హీరోలను తలదన్నేలా బ్రహ్మానందం ఆస్తులు ఉన్నాయని సమాచారం ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 600 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఖరీదైన ఇల్లు లగ్జరీ కార్లు కూడా ఈయన గ్యారేజ్ లో ఉన్నాయి. మొత్తానికి బ్రహ్మానందం కమెడియన్ భారీ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టారని చెప్పాలి.