Brahmanandam: వెండి తెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు బ్రహ్మానందం ఒకరు. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా ఏ హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు కాదు.కొన్ని సినిమాలు ఈయన కామెడీ ద్వారానే హిట్ అయ్యాయి అంటే కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.ఇలా కమెడియన్ గా తన ముఖ కవళికలతోనూ మాట తీరుతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నారు.
వయసు పై పడటంతో ఈయన చాలా తక్కువ సినిమాలలో నటిస్తూ ఉన్నారు.ఇండస్ట్రీలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న బ్రహ్మానందం నాటకాలపై ఎంతో ఆసక్తి చూపించేవారు. ఈ క్రమంలోనే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చారు.అహనా పెళ్ళంట సినిమాతో వెండితెరకు పరిచయమైనటువంటి బ్రహ్మానందం తన సినీ కెరియర్ల సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించారు.
ఈయన ఒక్కో కాల్ షీట్ కు లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇలా బ్రహ్మానందం ఒక్కో సినిమాకి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఈయన భారీ మొత్తంలోనే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.
సాధారణం హీరోలను తలదన్నేలా బ్రహ్మానందం ఆస్తులు ఉన్నాయని సమాచారం ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 600 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఖరీదైన ఇల్లు లగ్జరీ కార్లు కూడా ఈయన గ్యారేజ్ లో ఉన్నాయి. మొత్తానికి బ్రహ్మానందం కమెడియన్ భారీ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…