గుండె సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పు తీసుకోవచ్చా..?

జీడిపప్పు అనేది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జీడిపప్పు అంటే తెలియని వారు లేరు.. దీనిని తినకుండా కూడా ఎవరూ లేరు. కరోనా కారణంగా వీటి కోసం క్యూ కట్టారు. వీటిని కొనాలన్నా కూడా జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.. ఎందకంటే వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.

ఈ జీడిపప్పులో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా బ్రెజిల్ దేశంలో ఉంటాయి. జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్‌ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్‌ జీడిపప్పులో ఉంటుంది. కిడ్నీ ఆకృతిలో కనపడటమే కాదు దీనివల్ల కిడ్నీలకు కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే చాలామందికి వీటిని తినడం వల్ల గుండెకు ఏమైనా ప్రమాదం ఉంటుందా అని.. అలాంటిది ఏమి ఉండదు.

ఇది గుండెకు ఎలాంటి హాని చేయదు. దీనిలో మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక జీడిపప్పు రోజూ తీసుకుంటే మేలు. దీనిని రక్తపోటు ఉన్నవాళ్లు కూడా వీటిని తీసుకోవచ్చు. దీనిలో సోడియం శాతం తక్కువగాను.. పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది.

విటమిన్ ఈ కూడా ఇందులో ఉంటుంది కనుక ఇవి కేన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి. జీడిపప్పును ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనత కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బొల్లివ్యాధిని తగ్గించడంలో కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది.