జీడిపప్పు అనేది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జీడిపప్పు అంటే తెలియని వారు లేరు.. దీనిని తినకుండా కూడా ఎవరూ లేరు. కరోనా కారణంగా వీటి కోసం క్యూ కట్టారు. వీటిని కొనాలన్నా కూడా జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.. ఎందకంటే వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.
ఈ జీడిపప్పులో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా బ్రెజిల్ దేశంలో ఉంటాయి. జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్ జీడిపప్పులో ఉంటుంది. కిడ్నీ ఆకృతిలో కనపడటమే కాదు దీనివల్ల కిడ్నీలకు కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే చాలామందికి వీటిని తినడం వల్ల గుండెకు ఏమైనా ప్రమాదం ఉంటుందా అని.. అలాంటిది ఏమి ఉండదు.
ఇది గుండెకు ఎలాంటి హాని చేయదు. దీనిలో మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక జీడిపప్పు రోజూ తీసుకుంటే మేలు. దీనిని రక్తపోటు ఉన్నవాళ్లు కూడా వీటిని తీసుకోవచ్చు. దీనిలో సోడియం శాతం తక్కువగాను.. పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది.
విటమిన్ ఈ కూడా ఇందులో ఉంటుంది కనుక ఇవి కేన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి. జీడిపప్పును ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనత కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బొల్లివ్యాధిని తగ్గించడంలో కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…