Cement Cost: భారీగా పెరుగుతున్న సిమెంట్ ధరలు..! అల్లాడుతున్న సామాన్యుడు..!

Cement Cost: భారీగా పెరుగుతున్న సిమెంట్ ధరలు..! అల్లాడుతున్న సామాన్యుడు..!

Cement Cost: సామాన్యుడు సొంతిళ్లు కట్టుకోవాలంటే సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న రేట్లు సొంతింటి కలలకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. సాధారణంగా సగటు మనిషికి సొంతిళ్లు, వాహనం ఉండాలని కోరకుంటాడు.

Cement Cost: భారీగా పెరుగుతున్న సిమెంట్ ధరలు..! అల్లాడుతున్న సామాన్యుడు..!
Cement Cost: భారీగా పెరుగుతున్న సిమెంట్ ధరలు..! అల్లాడుతున్న సామాన్యుడు..!

దీని కోసం ఎన్నో ఏళ్లుగా డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు. తమ కలను నెరవేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు కష్టపడుతుంటారు.  కానీ ప్రస్తుతం పెరగుతున్న ధరలు సామాన్యుడికి సొంతింటి కలను కలగానే మిగులుస్తున్నాయి.

Cement Cost: భారీగా పెరుగుతున్న సిమెంట్ ధరలు..! అల్లాడుతున్న సామాన్యుడు..!

ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణాలకు అవసరం అయ్యే సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుక ఇలా అన్నింటికి ధరలు పెరుగుతున్నాయి డిమాండ్ ను ఆసరా చేసుకుంటూ… తమకు ఇష్టం వచ్చినట్లుగా రేట్లను పెంచుతున్నాయి. 

బస్తా ధర బ్రాండ్ ను బట్టి రూ.310..

తాజాగా ఇంటి నిర్మాణాలకు అవసరం అయ్యే సిమెంట్ ధరలు మరోసారి చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 1 నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో సిమెంట్ రేట్లు పెరిగాయి. దీంతో ఇళ్ల నిర్మాణాల వ్యయాలు లక్షల్లో పెరిగే అవకాశం ఏర్పడింది. తాజాగా ఒక బస్తాపై రూ.20 నుంచి రూ. 50 వరకు పెరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది.
ప్రతీ సారి డిమాండ్ ఆధారం చేసుకుని సిమెంట్, ఐరన్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో సిమెంట్, ఐరన్ కంపెనీలు ధరలను తగ్గించాయి.ఈ ఏడాది నుంచి ముడి పదార్ధాల ధరలు పెరగడంతో ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి.