నోటి దుర్వాసనకు జాజికాయ తో చెక్ పెట్టండి ఇలా..!

ఈ మధ్యకాలంలో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందికి పళ్ళు పసుపు రంగులోకి మారుతుంటాయి.అలాంటివారు పళ్ళు తెల్లగా అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరికొంతమందికి నోరు ఎల్లప్పుడూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు నలుగురిలో మాట్లాడటానికి మొహమాట పడుతూ ఉంటారు.అయితే ఈ నోటి దుర్వాసన సమస్య పోగొట్టడానికి జాజికాయ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంతే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కోసం ఆయుర్వేదంలో ఈ జాజికాయను విరివిగా ఉపయోగిస్తుంటారు.అయితే జాజికాయను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

పళ్ళు పసుపు పచ్చగా ఉండి నోరు దుర్వాసన వచ్చేవారు తాంబూలంలో జాజికాయను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. అదేవిధంగా పళ్ళ మీద ఏర్పడిన పసుపుపచ్చని గార కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు గ్లాసు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి. కొద్ది పరిమాణంలో జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల చర్మ కాంతి మెరుగు పడటమే కాకుండా, చర్మంపై ముడతలను సైతం నివారిస్తుంది.

నిత్యం ఈ జాజికాయను తీసుకోవటంవల్ల దాహాన్ని తగ్గించడంతో పాటు, జలుబు, దగ్గు, కఫం వంటి వాటికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.జాజికాయలో లభించే ‘మిరిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. జాజికాయ పొడిని మిశ్రమంలా తయారు చేసుకొని మొహానికి స్క్రబ్ మాదిరిగా వాడటం వల్ల చర్మకాంతి రెట్టింపవుతుంది. అయితే ఈ జాజికాయను తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాజికాయను ఉపయోగించకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.