General News

వరుడికి ప్రియుడు ఫోటోలు పంపడంతో ఆగిపోయిన పెళ్లి..!

మనం సినిమాలలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటాము. పెళ్లి జరిగే సమయానికి ఆపండి అనడం మనం వింటూ ఉంటాం. తాళి కట్టే సమయంలో ఏదో ఒక కారణాల వల్ల ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి తరహాలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వధువు ప్రియుడి నిర్వాకం వల్ల జరగాల్సిన పెళ్లి ఆగిపోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి మండలం మహేంద్రవాడలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. పెళ్లి కుమార్తె ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు మరొక వివాహం నిశ్చయించారు. అయితే తాను ప్రేమించిన యువతికి మరొక వ్యక్తితో పెళ్లి జరుగుతుందని కోపంతో నాకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో ఆ ప్రియుడు వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను వరుడికి పంపించాడు. ఈ ఫోటోలను చూసిన వరుడు, అతని కుటుంబ సభ్యులు ఈ పెళ్లి జరగడానికి అంగీకరించలేదు.

వరుడు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వధువు కుటుంబ సభ్యులకు తెలియజేసి ఈ పెళ్ళి జరగడానికి ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది. వధువు కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి ఎంత చెప్పినా వరుడి కుటుంబ సభ్యులు వినక పోవడంతో ఈ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ విధంగా పెళ్లి ఆగిపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు కుటుంబ సభ్యులు, బంధువులు వధువు ప్రియుని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆ ప్రియున్ని అనపర్తి పోలీస్ స్టేషన్లో అప్పగించి అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago