Chiranjeevi: ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించండి… మార్పుకు కృషి చేయండి: చిరంజీవి

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు సమాజానికి ప్రయోజనకరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈయన ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

తెలంగాణ సీఎంఓ నేతృత్వంలోని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చిరు చెప్పారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్న లేకపోతే డ్రగ్స్ పంపిణీ చేయడం కొనుగోలు చేయడం వంటివి కనుక చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 87126 71111 నంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌న్నారు.

డ్రగ్స్ రహిత రాష్ట్రం..
ఈ విధంగా డ్రగ్స్ గురించి సమాచారం అందించిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.బాధితులను వ్యసనాల నుండి విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప వారిని శిక్షించడం కాదన్నారు. ఇలా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చడం కోసం నాతో పాటు మీరందరూ కూడా చేతులు కలపాలని ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించి మార్పు తీసుకురావడం కోసం కృషి చేయాలి అంటూ ఈ సందర్భంగా చిరు చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.