Amani: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి ఆమని. ఈమె సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రాజేంద్రప్రసాద్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఆమని అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఆమని ఇటీవల మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈమె వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తాను సినిమాలు చేసే సమయంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ముఖ్యంగా చాలా డైట్ ఫాలో కావటం వల్ల నాకు తెలియకుండానే నేను చాలా వీక్ అయిపోయానని తెలిపారు. ఇలా నా బాడీలో ప్రోటీన్ ఎస్ అనేది తక్కువగా ఉండటంతో పిల్లలు కలగలేదు ఏకంగా ఆరుసార్లు తాను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అయిందని తెలిపారు.
మానసికంగా నలిగిపోయాను..
ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక డాక్టర్లు కూడా తలలు పట్టుకున్నారు అయితే తనకు ఇన్నిసార్లు అబార్షన్ కావడంతో నరకం అనుభవించానని, మానసికంగా ఎంతో కృంగిపోయానని తెలిపారు అయితే చివరికి ఒక డాక్టర్ నా సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ చేశారు అప్పుడు తనకు పిల్లలు కలిగారు అంటూ ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…