Chiranjeevi: చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి అమ్ముడుపోలేదు.. అప్పుల పాలయ్యారు: ఎన్వీ ప్రసాద్

Chiranjeevi:ఆచార్య సినిమా వంటి ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రబృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి పొలిటికల్ జర్నీలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి ఈయన మాట్లాడారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన 2009వ సంవత్సరంలో ఎన్నికల బరిలోకి దిగారు మొదటిసారి ఎన్నికలలో పాల్గొన్నప్పటికీ ఈయన ఏకంగా 18 స్థానాలలో గెలుపు సాధించారు.

ఇకపోతే 2011 వ సంవత్సరంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.ఇలా కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయటం వల్ల చిరంజీవి గురించి చాలా మంది ఎన్నో విమర్శలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, భారీ మొత్తంలో డబ్బు తీసుకొని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని ఆయన గురించి విమర్శలు చేశారు. కానీ చిరంజీవి డబ్బులకు అమ్ముడు పోలేదని
ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు.

 

Chiranjeevi: చిరంజీవి ఆస్తులు అమ్మి అప్పులు తీర్చారు..

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన తర్వాత జరిగిన సంఘటన గురించి ఈయన చెబుతూ..మద్రాసు ప్రసాద్ ల్యాబ్ పక్కనుండే కృష్ణానగర్ గార్డెన్ ప్రాపర్టీ అమ్మి, ప్రజారాజ్యం పార్టీ అమ్మేముందు తన అప్పులన్నీ తీర్చాలని ఈ సందర్భంగా ప్రసాద్ వెల్లడించారు. అయితే చిరంజీవి గురించి ఎంతోమంది ఎన్నో మాటలు అన్న ఆయన ఏ మాత్రం నోరు విప్పలేదు కానీ చిరంజీవి గారిని ఎవరైనా, ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం ఊరుకోరని ప్రసాద్ తెలిపారు. ఈ విధంగా ప్రజారాజ్యం బాధ నుంచి పుట్టినదే జనసేన అంటూ ఎన్వీ ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.