Featured

Actor Uttej : అన్నయ్యను చూసి అసూయ కలిగిందా గరికపాటి?? ఉత్తేజ్

Actor Uttej : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఈ ఏడాది కూడా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో అలాయ్ బలాయ్ నిర్వహించారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చూసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. రాకరాక మెగాస్టార్ రావడంతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ బాగా వైరల్ అయింది చాలా మంది సినిమా వాళ్ళు ఈ ఇష్యూ లో గరికపాటి నరసింహారావు గారిని తప్పుబడుతున్నారు.

అన్నయ్య ను చూస్తే అసూయ కలిగిందా…

ఇక ఈ ఇష్యూ జరిగి కొన్నిరోజులు గడిచినా కూడా ఇంకా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా సీనియర్ యాక్టర్ ఉత్తేజ్ ఈ విషయం గురించి స్పందించారు. చాలా రోజులుగా మీడియాకు దూరంగ ఉన్న ఆయన మళ్ళీ ఈ ఇష్యూ గురించి మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చారు. మీడియా పోకడ వాళ్ళు పెట్టే థంబ్ నైల్స్ నచ్చక దానికి దూరంగా ఉన్నానని అయితే ఇప్పుడు జరిగిన సంఘటన నాకు నచ్చలేదు అందుకే మాట్లాడాలని వచ్చాను అంటూ చెప్పారు. చిరంజీవి గారిని అలా పరుషంగా ఎలా మాటాడగలిగారు గరికపాటి గారు.

అవధానులు మీరు నిశిద్ద పదాలు ఉంటాయి కదా అందులో అలా ఆయన పేరు చెప్పకుండా ఫోటో సెషన్ ఆపండి అని ఉండవచ్చక్కడ అంటూ కామెంట్స్ చేసారు. అసహనం, అసూయ కు అతీతులుగా మాట్లాడేవాళ్ళు ఇలా చేయడమేంటి అని ప్రశ్నించారు. చిరంజీవి గారు ఒక గరిక లాగా మొదలై ఇప్పుడు మహావృక్షం అయ్యారు అలాంటి వ్యక్తిని మాట్లాడేంత గొప్పవాడివా నువ్వింకా గరికవే అంటూ ఉత్తేజ్ అన్నారు. గరికపాటి గారు అలా మాట్లాడినా కూడా అది విన్నారో లేదో తెలియదు కానీ చిరంజీవి గారు మాత్రం గరికపాటి గారిని గౌరవంగా మాట్లాడారు, మా ఇంటికి ఆహ్వానించాలని అనుకుంటున్నాను మీ ప్రవచనాలకు నేను అభిమానిని అంటూ మాట్లాడారు, అది చిరంజీవి గారి గొప్పతనం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

వేసవిలో తేనె తినాలా? తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు!

వేసవి కాలంలో శరీరంలో వేడి పెరగడం సహజం. అందుకే ఈ సీజన్‌లో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు…

10 minutes ago

శ్మశానంలో పెండ్లి.. జంటకు షాక్.. విచారణ మొదలు

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక జంట శ్మశాన వాటికలో…

16 minutes ago

చల్లగా ఉందని తాగేస్తున్నారా? చెరకు రసం అందరికీ మంచిదేనా? కొందరికి మాత్రం ప్రమాదమే!

వేసవి కాలం మొదలైతే చల్లని పానీయాల వైపు అందరూ మొగ్గు చూపుతారు. ముఖ్యంగా చెరకు రసం, కొబ్బరి నీరు వంటి…

19 minutes ago

రోజూ పప్పు తింటే గుండె జబ్బులు దూరం అవుతాయా?

నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

29 minutes ago

ఎద్దు బాధపై రష్మి ఆగ్రహం.. కఠిన చర్యల డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత అంశంపై జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు అనూహ్యంగా జంతు హింస వివాదానికి దారితీసింది. తిరుపతిలో వైసీపీ…

31 minutes ago

ఆధార్‌లో కులం చూసి హీరో ఛాన్స్ క్యాన్సిల్.. షాకింగ్ రివీల్

టాలీవుడ్‌లో అవకాశాల కోసం పోరాడుతున్న కొత్త నటుల కథల్లో కొన్నిసార్లు చేదు నిజాలు బయటపడుతుంటాయి. అలాంటి అనుభవాన్నే తాజాగా నటుడు…

34 minutes ago