Featured

V. V. Vinayak : బద్రినాథ్ సినిమాలో బ్రహ్మానందం సీన్స్ తీసేసి ఉంటే సినిమా హిట్ అయి ఉండేది… నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు అదే : వి వి వినాయక్

V. V. Vinayak : మాస్ సినిమాకు పెట్టింది పేరు వినాయక్. మొదటి సినిమా ‘ఆది’ తోనే హిట్ అందుకుని మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇక ఆ సినిమా తరువాత చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్ వంటి సినిమాలతో హిట్ అందుకున్న వినాయక్ హీరోలను మాస్ ఎలివేషన్ తో చూపిస్తాడు. దాదాపు అందరు పెద్ద హీరోలతో సినిమాలలు తీసిన వినాయక్ ‘అఖిల్’ సినిమాతో డిజాస్టర్ చూసాడు. ఇమా ఆ తరువాత వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమా కూడా నిరాశపరచడంతో ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్ చేయకుండా ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో హిట్ అవుతాయనుకున్న కొన్ని సినిమాల ఫలితాలు నిరాశపరచడానికి కారణాలను చెప్పారు.

బద్రినాథ్ సినిమాలో ఆ సీన్స్ లేకపోయింటే హిట్ అయ్యుండేది…

అల్లు అర్జున్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బద్రినాథ్ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఇక ఈ సినిమా వైఫల్యానికి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండటమే అన్న టాక్ అప్పట్లో వినిపించినా వినాయక్ దాని వివరణ ఇచ్చారు. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండటమే కాదు అలానే సినిమాలో హిమాలయాలు ఆ ప్రాంతాలు మనవాళ్లకు కొత్తగా అనిపించాయి. బాహుబలి లో లాగా ముందు ఏ ప్రాంతం అక్కడ విశిష్టత ఇలాంటి జియోగ్రఫీకి సంబంధించిన విషయాలను వివరించాల్సింది అలా చేయకుండా కథలోకి వెళ్లిపోవడం వల్ల జనాలకు ఎక్కలేదు. ఇక సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్స్ ట్రాక్ లేకుండా ఉండుంటే సినిమా హిట్ అయ్యుండేది అని నా అభిప్రాయం అంటూ చెప్పారు.

సెకండ్ హాఫ్ సినిమాలో నిడివి తక్కువ అవడం వల్ల ఆ కామెడీ ట్రాక్ ఉంచాల్సి వచ్చింది అంటూ చెప్పారు. ఇక జీవితంలో బాగా బాధపడిన సంఘటన తల్లిదండ్రులు దూరమైనపుడు. ఇక జీవితంలో చేసిన తప్పు అంటే రాశీ నరసింహారావు గారికి దూరం అవడం. పక్కన వాళ్ళు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడం వల్ల ఆయన మా నాన్న వద్ద నా గురించి అనకూడని మాట అనడంతో దూరం పెరిగింది. నేను వెళ్లి నేరుగా ఆయనతో మాట్లాడుంటే ఈ మనస్పర్థలు ఉందేవి కాదు అయితే మళ్ళీ కొన్ని రోజులు గడిచాక మళ్ళీ కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, గతంలో జరిగిన విషయాలు మాత్రం నాకు నచ్చవు అలా జరగకుండా ఉండివుంటే బాగుండు అనిపిస్తుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago