Chiranjeevi: మెగాస్టార్ మనస్తత్వానికి రాజకీయాలు పనికిరావు… వద్దని చెబితే హర్ట్ అయ్యారు: యండమూరి వీరేంద్రనాథ్

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం ప్రజాసేవకై ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్న మెగాస్టార్ తిరిగి రీఎంట్రీ ఇచ్చి సినిమాలతో దూసుకుపోతున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ మనస్తత్వానికి రాజకీయాలు పనికిరావు… వద్దని చెబితే హర్ట్ అయ్యారు: యండమూరి వీరేంద్రనాథ్

ఈ క్రమంలోనే రచయితగా,ఒక మోటివేటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్ మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Chiranjeevi: మెగాస్టార్ మనస్తత్వానికి రాజకీయాలు పనికిరావు… వద్దని చెబితే హర్ట్ అయ్యారు: యండమూరి వీరేంద్రనాథ్

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి మీకు మధ్య ఏదో మనస్పర్థలు వచ్చాయనే ప్రశ్న ఎదురవడంతో తనకు మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి మనస్పర్థలు లేవని వెల్లడించారు. రామ్ చరణ్ పై ఏదో కామెంట్ చేసినందుకు ఆయన హర్ట్ అయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ నాకు చిరంజీవికి మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవని తెలిపారు.ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో వద్దని చెప్పారంట కదా అనే ప్రశ్న కూడా యండమూరికి ఎదురైంది.

చిరంజీవికి రాజకీయాలు సెట్ కావు…

ఈ సందర్భంగా ఎండమూరి మాట్లాడుతూ తాను చిరంజీవితో కలిసి చాలా సంవత్సరాలపాటు జర్నీ చేశాను. కనుక ఆయన పార్టీని స్థాపించిన ఆశించిన స్థాయిలో అతను రాజకీయాలలో రాణించలేడని తెలుసు అదే విషయాన్ని అతనికి చెప్పడంతో అతను హర్ట్ అయ్యారు. చిరంజీవికి ఉన్న మనస్తత్వానికి రాజకీయాలు సెట్ కావు. అందుకే పార్టీ పెట్టేటప్పుడు వద్దని చెప్పాను. అలా చిరంజీవికీ అడ్డు చెప్పడంతో ఆయన హర్ట్ అయ్యారని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు.