Pooja Kannan: నటి సాయి పల్లవి తెలుగు ఎంట్రీ ఇవ్వకుండానే మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ సినిమా అనంతరం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటన, డాన్సులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇలా ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయిపల్లవి తెలుగులో వరుస అవకాశాలను అందుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకొని మంచి విజయాలను అందుకుంటున్న సాయిపల్లవి కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా అద్భుతమైన డాన్సర్ అని చెప్పవచ్చు.
ఈమెతో పాటు డాన్స్ చేయాలంటే చాలా కష్టతరం అని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారే బహిరంగంగా వెల్లడించారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవికి ఒక చెల్లెలు పూజకన్న ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. ఈమె తెలుగు తెరకు పరిచయం కాకపోయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్న.
పూజకన్నన్ చూడటానికి అచ్చం సాయి పల్లవి పోలికలతో ఉంటారు. కేవలం పోలికలు మాత్రమే కాకుండా వీరిద్దరు కూడా అద్భుతమైన డాన్సర్లు. పూజ కన్నన్ కూడా తన అక్క సాయి పల్లవికి ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతమైన డాన్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే పూజకన్నన్ సోషల్ మీడియా వేదికగా క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో షేర్ చేశారు.లంగావోని ధరించి ఎంతో అద్భుతంగా డాన్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సాయి పల్లవి సోదరి డాన్స్ ఫర్ఫార్మెన్స్ పై ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…