Chiranjeevi : రివ్యూలు నాకు ఎంతో మేలు చేశాయి.. : చిరంజీవి

Chiranjeevi intresting comments on reviews :
కొణిదెల శివశంకర ప్రసాద్ నుంచి చిరంజీవికి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి స్వయంకృషితో తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగి ఎందరికో ఆదర్శంగా ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా ఎవరైనా ఎదగాలి అంటే ఇప్పటికీ మెగాస్టార్ గారి నే ఆదర్శంగా తీసుకుంటారు. చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదగడానికి ఆయన వెనుక ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆప్తులు ఉన్నారు అని ఆయన చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో తనపై వచ్చిన రివ్యూల నుంచి తను ఎంత నేర్చుకున్నాడు అన్న విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi : రివ్యూలు నాకు ఎంతో మేలు చేశాయి.. : చిరంజీవి

జర్నలిస్టును పిలిచి థాంక్స్….

జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ దివంగత జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గురించి ఇలా మాట్లాడారు… నేను ప్రాణం ఖరీదు సినిమా తీసే సమయంలో ఎవరైనా నా ఫోటో ని పేపర్ లో వేస్తే బాగుంటుంది అని చాలా అనుకున్నాను, కానీ ఎవరు వేయలేదు అప్పుడు పసుపులేటి రామారావు గారు తాను పనిచేస్తున్న పత్రికలో నా ఫోటోను ప్రచురించి నా గురించి ఆర్టికల్ రాశారు. ఆ సమయంలో నేను చాలా ఆనందపడ్డాను. అందుకే ఆయనను పిలిచి థాంక్స్ కూడ చెప్పాను, వట్టి థాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది అని చేతిలో డబ్బులు పెట్టి పోయాను అందుకు ఆయన ఇలాంటి నటులను ఎంకరేజ్ చేయడం నా బాధ్యత డబ్బులు వద్దన్నారు. ఆయనని చూసిన తర్వాత నే జర్నలిస్టుల మీద నాకు అపారమైన గౌరవం కలిగింది, నేను జర్నలిస్ట్లను గౌరవిస్తాను అంటే ఆయనే కారణం. పసుపులేటి రామారావు గారి తో పాటు నా నటన తీర్చిదిద్దిన వారిలో గుడిపూడి శ్రీహరిరావు, ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్‌ లాంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు.

గుడిపూడి శ్రీహరి గారు సితార లో నా సినిమా గురించి ఏదైనా రివ్యూ రాస్తే ఒక టీచర్ లాగా నటనలోని మైనస్ లను చూపించే వారని గుర్తు చేసుకున్నారు . నేను వేగంగా మాట్లాడతాను అని నాకు తెలుసు కానీ అది నా సినిమాల్లో ఎప్పుడూ ఇబ్బంది కలుగుతుందని అనుకోలేదు. కానీ ఒక రివ్యూలో కథలో వేగం ఉండొచ్చు కానీ మాటలో ఉండకూడదు, అని రాశారు అది చూసిన తర్వాత నే నా డైలాగ్ మాడ్యులేషన్ మార్చుకున్నాను. అది నా కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇలా ఆయన జర్నలిస్టు రాసే రివ్యూలు తన సినీ ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పడంతో అందరినీ దృష్టిని ఆకట్టుకుంటున్నారు.