Talasani Srinivas Yadav : ఏపీ లో సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం టాలీవుడ్ కి పెద్ద దిక్కు ఎవరనే విషయం ఈ రెండు ఇప్పట్లో ముగిసే విషయాలు కాదు. ఏదో ఒకరి నోటినుండి రోజు వైరల్ అవుతున్నాయి. దాసరి నారాయణరావు గారు ఉన్నపుడు ఆయన టాలీవుడ్ పెద్ద దిక్కుగా హుందాగా ఆ హోదా ఉండేది. ఇక ఆయన మరణం తరువాత ఎవరు ప్రతి విషయాన్నీ పట్టించుకుంటారు సినిమా వల్ల కష్టాలను ఎవరితో చెప్పుకుంటారు అంటే సమాధానం లేదు అందరు మెగాస్టార్ చిరంజీవి వైపు చూసారు. కానీ మెగా, మంచు కుటుంబాల మధ్య ఉన్న కోల్డ్ వార్ ఒకవైపు చిరంజీవి గారే స్వయంగా నేను పెద్ద గా ఉండను అని చెప్పడం ఒకవైపు ఇక టాలీవుడ్ ఎటు తేల్చుకోలేక పోయింది.
చిరంజీవి నే ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు తలసాని వాఖ్యలు….
ఇక ఎవరికీ తోచినట్టు వాళ్లు ఈ విషయంలో కామెంట్స్ చేసారు. ఇక ఒకానొక సందర్బంలో రాజమౌళి వంటివారు కూడా చిరంజీవినే పెద్ద దిక్కు ఇండస్ట్రీకి అని తేల్చారు. ఇక నేను ఇరువురి మధ్య తగాదాలను తీర్చే పంచాయతి పెద్దగా నేను ఉండలేనని ఇండస్ట్రీలోని కార్మికులు, చిన్న క్యారెక్టర్స్ చేసే వల్ల సమస్యలకోసం ముందుంటానని ఇంతకు ముందే చిరంజీవి చెప్పేసారు. ఇక రీసెంట్ గా టికెట్ రేట్ల విషయంలో చొరవ తీసుకుని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడారు.
ఇక ఇపుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి ఇండస్ట్రీ పెద్ద విషయం మాట్లాడారు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవే అని చెప్పారు. ఫిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సినిమా పెద్దగా ఒక దశలో మోహన్ బాబు ఉండాలని భావించినా సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ డామినేషన్ వల్ల కుదరలేదు ఇక మంచు విష్ణు ఎపుడు మా ప్రెసిడెంట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ రెండు వర్గాలు గా చీలి విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…