Chiranjeevi : ప్రస్తుత సినిమాలను లోతుగా గమనిస్తే..మనం ఎప్పుడో చూసిన పాత సినిమా గుర్తుకువస్తుంటుంది. సినిమా టేకింగ్, కెమెరా పనితనం అంతకుమించి సినిమాలో వచ్చిన వేగం ఇప్పటి సినిమాలలో గమనించవచ్చు. కే జి ఎఫ్ సినిమా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన “రాక్షసుడు” చిత్రం ఒకేలా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన కే జి ఎఫ్ చిత్ర కథను ఒకసారి గమనిస్తే…
1981 లో కోలారు బంగారు గనులును ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను తయారు చేసుకున్నాడు. 2018లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ సాధారణ యువకుడు ఫీల్డ్స్ ఎలా అధినేత అయ్యాడనే క్రమంపై పుస్తకం రాస్తాడు దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. దానిపై పరిశోధన చేసే ఓ ప్రతికాధినేతకు ఆ పుస్తకాన్ని రాసిన జర్నలిస్ట్ కథను వివరించడంతో కథ మొదలవుతుంది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సూర్యవర్ధన్‌కి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న సూర్య వర్దన్ స్థలం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని పటిష్ఠమైన కాపలాను పెట్టుకుని బంగారం తవ్వే పని ప్రారంభిస్తాడు.
చుట్టు పక్కల గ్రామాల్లోని నివసించే ప్రజలను తీసుకొచ్చి వారిని బానిసలుగా మార్చి పనులు చేయిస్తుంటాడు. అనుకోకుండా సూర్యవర్ధన్‌కి పక్షవాతం వస్తుంది . దాంతో అందరూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌పై అధిపత్యం సాధించాలని చూస్తుంటారు. అయితే సూర్యవర్ధన్ కొడుకు గరుడ అందరినీ తన కంట్రోల్‌లో ఉంచుకుని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అధిపతిగా ఉంటాడు. అయితే సూర్యవర్ధన్‌కు నమ్మకంగా ఉన్న ఐదు మంది గరుడను చంపి ఆ బంగారు గనులకు నాయకులుగా ఎదగాలని నిర్ణయించుకుంటారు.
ఇకపోతే 36 ఏళ్ల క్రితం ఇలాంటి కథతోనే చిరంజీవి “రాక్షసుడు” అనే చిత్రంలో నటించారు సంక్షిప్తంగా చిత్ర కథను పరిశీలిస్తే.. వితంతు మహిళ మగబిడ్డకు జన్మనివ్వడంతో సినిమా తెరకెక్కింది. భూస్వామి దీనిని ఆమోదించలేదు మరియు శిశువును పారవేసాడు.ఒక తాగుబోతు శిశువును కనుగొని, డబ్బుకు బదులుగా ఆ అబ్బాయిని లేబర్ క్యాంప్‌కు విక్రయించే వరకు కొన్ని సంవత్సరాల పాటు ఉంచాడు. 20 సంవత్సరాల తరువాత, పురుష ( చిరంజీవి ) మరియు అతని స్నేహితుడు సింహం ( నాగేంద్ర బాబు ) లేబర్ క్యాంపు నుండి పురుష తల్లిని ( అన్నపూర్ణ ) చూడటానికి పారిపోతారు.
అయితే పురుష ఇంటి యజమాని దగ్గరకు వెళ్లగా.. చాలా కాలం క్రితం పురుష తల్లి వెళ్లిపోయిందని, వివరాలు రాబట్టాలంటే యజమానికి లంచం ఇవ్వాల్సిందేనని యజమాని చెప్తాడు. పురుష తన ప్రతీకారం తీర్చుకోవడం మరియు అతని తల్లిని ఎలా కలుస్తాడు అనేది మిగిలిన కథ… సినిమా టేకింగ్ లో రాక్షసుడు, కే జి ఎఫ్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఈ రెండు సినిమాలకు ఉన్న తేడా ఏమిటంటే ఫోటోగ్రఫీ. కే జి ఎఫ్ మొత్తం చీకటి ఛాయలతో కూడిన దృశ్యాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…